iQOO 15R vs POCO X8 Pro Max: ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఫ్లాగ్ షిప్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది iQOO 15R, POCO X8 Pro Max మాత్రం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ రెండు ఫోన్లు.. దాదాపుగా ఒకే ధరను కలిగి ఉండటంతో ఏది కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందో ఈ కథనంలో పరిశీలిద్దాం.
iQOO 15R ఫోన్ 6.59-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌తో రూపొందింది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5000 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ని కలిగి ఉండటం వల్ల గేమింగ్, ఎండలో వాడటానికి చాలా బాగా అనుకూలంగా ఉండనుంది. మరోవైపు POCO X8 Pro Max కాస్త పెద్దగా 6.83 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్, 3500 nits బ్రైట్‌నెస్ అందించారు. పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి పోకో బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. కానీ డిస్‌ప్లే క్వాలిటీ, స్మూత్‌నెస్ విషయంలో iQOO కాస్త పైచేయిగా కనిపిస్తోంది.
పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే iQOO 15R లో అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఉంది. ఇది గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. POCO X8 Pro Max లో MediaTek Dimensity 9500s ప్రాసెసర్ వాడారు. ఇది కూడా చాలా వేగంగా పనిచేస్తుంది కానీ బెంచ్ మార్క్ స్కోర్లు, గ్రాఫిక్స్ పనితీరులో కాస్త వెనుకబడి పోయింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న iQOO దీనికంటే మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. గేమింగ్ కోసం iQOO లో ప్రత్యేకమైన Q2 చిప్ కూడా ఉండటం విశేషం.
ఈ విభాగంలో POCO X8 Pro Max స్పష్టమైన విజేతగా నిలుస్తోంది. దీనిలో భారీ 9000mAh బ్యాటరీ అమర్చారు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 2-3 రోజుల వరకు వస్తుంది. మరోవైపు iQOO 15R లో 7600mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్‌లు కూడా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. మీకు బ్యాటరీ లైఫ్ ప్రాధాన్యత అయితే పోకోను మించిన ఆప్షన్ లేదని చెప్పొచ్చు.
రెండు ఫోన్‌లలోనూ 50MP ప్రధాన కెమెరా (OIS)తో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అయితే iQOO లో Sony LYT-700V సెన్సార్ ఉండటం వల్ల ఫోటోలు కొంచెం క్లారిటీగా వస్తాయి. భద్రత విషయంలో విషయంలో పోకో IP69K రేటింగ్ కలిగి ఉంది. అంటే నీటిలో పడినా లేదా ధూళి తగిలినా ఇది తట్టుకుంటుంది. iQOOలో కూడా IP69 రేటింగ్ ను అందించారు.
Also Read: KBC Winner Arrest: కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు విన్.. చివరికి జైలు పాలు.. ఏం జరిగిందంటే?
ఐకూ లేదా పోకో ఫోన్లలో ఏది కొనాలన్న అంశం పూర్తిగా మీ అభిరుచులపై ఆధార పడింటుంది. ఒకవేళ మీరు మొబైల్ గేమింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారైతే.. iQOO 15R బెస్ట్ ఆప్షన్. దీని ప్రొసెసర్ చాలా వేగంగా ఉంటుంది. మరోవైపు మీకు ఛార్జింగ్ ప్రాధాన్యత అనిపిస్తే 9000mAh బ్యాటరీ కలిగిన POCO X8 Pro Max మేలైనది. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల సినిమాలు, సిరీస్ లు వీక్షించడానికి ఇది అనువైనదిగా ఉంటుంది.
Also Read: Viral Video: గుడిలో చెప్పులు వేసుకొని.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చావగొట్టిన భక్తులు..!