E-Paper
Advertisement

SADAREM: గుడ్ న్యూస్.. సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తున్నారా..!

SADAREM: గుడ్ న్యూస్.. సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తున్నారా..!
Advertisement

SADAREM: స్వేచ్ఛ బ్యూరో: సదరం (SADAREM) క్యాంపుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ఫ్ సిఈఓ దివ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే UDID దరఖాస్తులపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు మాట్లాడుతూ జిల్లాలో సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.

పరిష్కారం కోసం ప్రత్యేక రిజిస్టర్

UDID దరఖాస్తులు వచ్చిన వెంటనే SADAREMలో నమోదు చేయాలన్నారు. కొత్త దరఖాస్తులపై సమయానికి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలి. రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కారం కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి.UDID కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు .డిజిటైజేషన్, సరెండర్ మరియు పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

Advertisement

Also Read: Crime News: మేడ్చల్‌ బస్టాండ్‌లో పట్టపగలు గంజాయి బ్యాచ్ కలకలం

డిఆర్డిఓ మాట్లాడుతూ..

NHC, PwD, SHGs సభ్యులలో UDID కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలని, ఈ సందర్భంగా డిఆర్డిఓ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెలకు సంబంధించిన సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని తెలిపారు. లబ్ధిదారులు క్యాంపులకు సకాలంలో హాజరు కావడానికి వారికి ఫోన్ కాల్ ద్వారా ముందస్తుగా సమాచారమివ్వాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డా. కిరణ్ సుమన్ (APO) మరియు సదరం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also Read: Logo Misuse: మీరు ట్యాంకర్ నీరు వాడుతున్నారా.. అయితే జలమండలి శాఖ షాకింగ్ కామెంట్స్!

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×