E-Paper
Advertisement

Mini Projectors under 5000: స్మార్ట్ టీవీ కొనక్కర్లేదు.. కేవలం రూ.3,600కే మీ బెడ్‌రూమ్ సినిమా హాల్ అయిపోతుంది!

Mini Projectors under 5000: స్మార్ట్ టీవీ కొనక్కర్లేదు.. కేవలం రూ.3,600కే మీ బెడ్‌రూమ్ సినిమా హాల్ అయిపోతుంది!
Advertisement

Mini Projectors under 5000: ప్రస్తుతం సినిమా అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ. థియేటర్‌కు వెళ్లి పెద్ద స్క్రీన్‌పై సినిమా చూస్తుంటే వచ్చే ఈ మజానే వేరు కదా. కానీ ప్రతిసారీ థియేటర్‌కు వెళ్లడం కుదరకపోవచ్చు. అందుకే ఇప్పుడు చాలామంది తమ ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకుంటున్నారు. దీనికోసం లక్షలు పెట్టి పెద్ద టీవీలు కొనక్కర్లేదు.. కేవలం ఒక చిన్న పోర్టబుల్ ప్రొజెక్టర్ ఉంటే చాలు. గోడనే స్క్రీన్‌లా మార్చేసి, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ5వేల లోపు అందుబాటులో ఉన్న టాప్-5 మినీ ప్రొజెక్టర్లపై ఓ లుక్కేసేద్దాం..

Stepify HY320 Mini 4K

చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ కోరుకునే వారికి ఈ ప్రొజెక్టర్ బెస్ట్ ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర కేవలం రూ.3,600 మాత్రమే. ఈ రేంజ్‌లో ఇది 4K కంటెంట్‌ను సపోర్ట్ చేయడం విశేషమే మరి. అంతేకాదు దీనికి ఇన్‌బిల్ట్ స్పీకర్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఈ ఒక్క ట్రిక్ వాడితే.. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 10పై రూ.12వేల డిస్కౌంట్ పక్కా!

Portronics Beam 440

ఒకవేళ మీరు ప్రొజెక్టర్‌లోనే మూవీస్ చూడాలనుకుంటే ఈ పోర్ట్రోనిక్స్ బీమ్ 440 సరిపోతుంది. అమెజాన్‌లో ఇది రూ.4,788 ధరకే దొరుకుతుంది. దీనిలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్స్ ముందే వస్తాయి. 720p HD రిజల్యూషన్‌తో ఇది మంచి విజువల్స్ ఫీల్‌ను అందిస్తుంది.

Zebronics Zeb-Pixa Play

Advertisement

బిగ్ స్క్రీన్ కావాలనుకునే వారికి జెబ్రోనిక్స్ నుంచి వస్తున్న ఈ మోడల్ బెస్ట్ ఛాయిస్. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది రూ.4,999కే లభిస్తుంది. ఈ డివైజ్ దాదాపు 100 ఇంచులకు పైగా స్క్రీన్ వ్యూను గోడపై ప్రొజెక్ట్ చేయగలదు. దీనిలో ఉండే బిల్ట్‌ఇన్ స్పీకర్లు బెడ్‌రూమ్‌కు సరిపడా ఆడియోను అందిస్తాయి.

Lifelong LightBeam

ప్రముఖ లైఫ్‌లాంగ్ సంస్థ అందిస్తున్న ఈ మినీ ప్రొజెక్టర్ బిగ్ బాస్కెట్‌లో రూ.4,999 ధరకు లభిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే వైఫై కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

E GATE Atom

ఈ ప్రొజెక్టర్ అమెజాన్‌లో రూ.4,870 ధరకే లభిస్తుంది. ఈ డివైజ్ 4K సపోర్ట్‌తో పాటు బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లను అందిస్తుంది. ఫోన్ స్క్రీన్‌ను పెద్దదిగా చూడాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ గ్యాడ్జెట్.

Also Read: రూ.60వేల లోపు టాప్-5 AI స్మార్ట్‌ఫోన్లు.. ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు అదిరిపోయే ఫీచర్లు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×