E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: గుంట నక్కను నమ్మి గోతిలో పడ్డారు.. బీఆర్ఎస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!

Kalvakuntla Kavitha: గుంట నక్కను నమ్మి గోతిలో పడ్డారు.. బీఆర్ఎస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!
Advertisement

Kalvakuntla Kavitha: నైనీ బొగ్గు గని వ్యవహారంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సింగరేణి వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఒక వింత ట్రెండ్ నడుస్తోందని, కొన్ని శాటిలైట్ ఛానెళ్లలో వస్తున్న వార్తలను బీఆర్ఎస్ నాయకులు గుడ్డిగా సమర్థిస్తున్నారని ఆమె విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేసిన ఒక ఛానెల్ కార్యాలయంపై కేటీఆర్ అనుచరులు దాడి చేయడాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టగానే, దానికి కౌంటర్ ఇవ్వడానికి కేటీఆర్ (గుంట నక్కగా అభివర్ణిస్తూ) హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీ ‘గుంట నక్క’ను నమ్మి గుడ్డిగా గోతిలో పడిందని, ప్రజలే త్వరలో ఆ పార్టీని నిషేధిస్తారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక జోక్‌లా మారిందని మండిపడ్డారు. అసలు టెర్రరిస్టుల నిఘా కోసం ఉండాల్సిన ట్యాపింగ్‌ను అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 నైనీ బొగ్గు గని 2015లో తెలంగాణకు కేటాయించబడిందని, అంతకుముందు అది గుజరాత్ వద్ద ఉండేదని ఆమె గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే డీజిల్ టెండర్లు ఉన్నాయని, వారి కాలంలోనే 25 టెండర్లు పొడిగించబడ్డాయని వెల్లడించారు.

Advertisement

 ఒక పెద్ద తిమింగలాన్ని (మెగా కృష్ణా రెడ్డిని ఉద్దేశించి) కాపాడటం కోసమే చిన్న చేపను పట్టుకొని నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. నైనీ బొగ్గు టెండర్ విలువ దాదాపు రూ. 25 వేల కోట్లు అని, సింగరేణికి ఉన్న 19 ఓపెన్ కాస్ట్, 22 అండర్ గ్రౌండ్ మైన్లను నిర్వీర్యం చేసేలా కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

సింగరేణి సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కవిత పలు కీలక డిమాండ్లు చేశారు. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (MDO) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రైవేట్ కంపెనీలకు మైన్లను కట్టబెట్టడాన్ని ఆపాలని కోరారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లో గ్రేడ్-9 బొగ్గు ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ధ్వజమెత్తారు.  తెలంగాణలోని అన్ని బొగ్గు ప్రాంతాలను సింగరేణికే కేటాయించాలని, కోల్ ఇండియా కంటే మెరుగైన వసతులు సింగరేణి కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు.

Read Also: BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×