Jabardasth Varsha (Image Credit: Instagram)
జబర్దస్త్ వర్ష.. ఒకప్పుడు పలు టీవీ సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ అందుకున్న ఈమె.. ఎప్పుడైతే జబర్దస్త్ కామెడీ షోలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిందో అమాంతం ఈమె క్రేజ్ పెరిగిపోయింది.

Jabardasth Varsha (Image Credit: Instagram)
ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో కలిసి చేసే స్కిట్స్ ఒక రేంజ్ లో పేలేవి. దీనికి తోడు వీరి మధ్య లవ్ ట్రాక్ సృష్టించి మల్లెమాల యూనిట్ చేసిన ప్రయోగం భారీగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

Jabardasth Varsha (Image Credit: Instagram)
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా భారీ పాపులారిటీ అందుకున్న వర్ష.. ఈ మధ్య జబర్దస్త్ కి దూరం అయిందని చెప్పాలి.

Jabardasth Varsha (Image Credit: Instagram)
మరోవైపు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

Jabardasth Varsha (Image Credit: Instagram)
ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Jabardasth Varsha (Image Credit: Instagram)
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను పంచుకునే ఈమె తాజాగా వెల్వెట్ బ్లూ కలర్ డ్రెస్ ధరించి అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ వర్షా షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.