Motorola 12GB Discount| ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2025 సంవత్సరం చివరిలో ప్రారంభించిన ఇయర్ ఎండ్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ సేల్‌లో మోటోరోలా G05 పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ కేవలం రూ.7,299కే అందుబాటులో ఉంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా ఒక నమ్మకమైన బ్రాండ్. కొనుగోలుదారులు మోటోరోలా ఫోన్‌లను నమ్మదగినవిగా, ఎక్కువ కాలం పనిచేసేవిగా భావిస్తారు. ఈ ఆఫర్‌తో మోటో G05 బడ్జెట్ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.
మోటోరోలా G05 తక్కువ ధరలో మంచి పర్‌ఫామెన్స్ అందిస్తుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా రోజువారీ పనులకు అనువైన ఫోన్ కావాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్. కాల్స్, బ్రౌజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పనులు స్మూత్‌గా జరుగుతాయి. విద్యార్థులు, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారు, సెకండరీ ఫోన్‌గా ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారికి చక్కగా సరిపోతుంది. మంచి ఫీచర్లు ఉండడంతో ఈ డిస్కౌంట్ ధరకు అందుబాటులో రావడంతో ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి మంచి ఛాయిస్.
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 29 వరకు మాత్రమే కొనసాగుతుంది. ఈ సమయంలో మోటో G05 ధర రూ.7,299కు తగ్గింది. అంతేకాకుండా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.
ఈజీ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి, నెలకు రూ.257 నుంచి మొదలవుతాయి. ఈ ఆఫర్లతో ఫోన్ మరింత బడ్జెట్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
మోటోరోలా G05లో 4GB ఫిజికల్ ర్యామ్ ఉంది. అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ ఉంది. మొత్తం 12GB ర్యామ్ వరకు ఈ ఫోన్ స్పీడ్ పెంచుకోవచ్చు. దీంతో పనితీరు మరింత స్మూత్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు ఎక్స్‌పాండ్ చేయవచ్చు. ఎక్కువ ఫొటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
మోటో G05లో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండడంతో స్క్రోలింగ్, యానిమేషన్స్ స్మూత్‌గా కనిపిస్తాయి. పీక్ బ్రైట్‌నెస్ 1,000 నిట్స్ వరకు ఉంటుంది, బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండడంతో స్క్రాచ్ ప్రూఫ్ ఫోన్.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు, క్యాజువల్ గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా చేస్తుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉపయోగించడంతో స్పీడ్, రెస్పాన్స్ మెరుగవుతాయి.
మోటో G05 ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. క్లీన్, సింపుల్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. అనవసరమైన యాప్‌లు లేవు. 5,200mAh బ్యాటరీ ఉంది, సాధారణ యూసేజ్ చేసేవారికి రోజంతా సులభంగా పనిచేస్తుంది. USB టైప్-C ద్వారా 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
బ్లూటూత్ 5.4, వై-ఫై, FM రేడియో సపోర్ట్ ఉన్నాయి. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. రోజువారీ వినియోగానికి ఇవి చాలా ఉపయోగకరం.
Also Read: మెటా రేబ్యాన్ గ్లాసెస్ రివ్యూ.. స్మార్ట్‌గ్లాసెస్ రావడంతో ఫోన్ కెమెరా అవసరం లేదా?
50MP మెయిన్ రియర్ కెమెరా ఉంది. పగటి వెలుతురులో స్పష్టమైన ఫొటోలు తీస్తుంది. బేసిక్ ఫొటోగ్రఫీకి సరిపోతుంది. 8MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు తగినంత మంచిది. డాల్బీ అట్మాస్ ఆడియో, IP52 డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి.
రూ.7,299 ధరలో మోటోరోలా G05 అద్భుతమైన వాల్యూ అందిస్తుంది. రోజువారీ అవసరాలకు సరిపడే ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ఈ డీల్‌ను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బడ్జెట్ కస్టమర్స్ ఈ ఆఫర్‌ను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.