E-Paper
Advertisement

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!
Advertisement

Budget Projectors: ఈ చల్ల చల్లని వానాకాలంలో.. వేడి వేడిగా పకోడీలు తింటూ పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? అలాగని రోజూ థియేటర్‌కి వెళ్లి మూవీ చూడలేం కదా! అందుకే దీనికోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా.. బడ్జెట్ ధరలోనే థియేటర్ అనుభూతిని ఇచ్చేందుకు పోర్టబుల్ ప్రొజెక్టర్లు వచ్చేసాయి. ఇవి దాదాపు 200 ఇంచుల వరకు స్క్రీన్ సైజ్ అందించడమే కాకుండా.. స్మార్ట్ టీవీ ఫీచర్లతో వస్తాయి. రూమ్‌లో లేదా ఇంటి బయట ఓపెన్ ప్లేస్‌లో మూవీ నైట్స్, గేమింగ్ ఎంజాయ్ చేయడానికి ఇవి చక్కగా సరిపోతాయి.

Nothing Projector One

అన్ని ఫీచర్లు ఉన్న ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తుంటే.. ఈ ‘నథింగ్ ప్రొజెక్టర్ వన్ గూగుల్ టీవీ’ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇది ఫుల్ హెచ్‌డీ (1080p) రిజల్యూషన్, 300 ANSI ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనిలో ఇన్‌బిల్ట్‌గా గూగుల్ టీవీ, స్ట్రీమింగ్ యాప్స్ ఉండటం వల్ల క్లారిటీతో పాటు వాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.

XGIMI MoGo 4

Advertisement

సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా స్ట్రీమింగ్ చేసే అలవాటు ఉంటే ‘XGIMI MoGo 4’ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీనిలో అఫీషియల్ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు గూగుల్ టీవీ సపోర్ట్ ఉంటుంది. దీని క్వాలిటీ స్పీకర్లు మంచి ఆడియోను అందిస్తాయి. దీని సైజ్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు.

Also Read: Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Lumio Arc 5

Advertisement

ప్రొజెక్టర్ సెట్ చేయడం కష్టంగా అనిపిస్తే ‘లూమియో ఆర్క్ 5’ను కొనుగోలు చేయవచ్చు. ఇది ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, డాల్బీ ఆడియోతో పాటు ఆటో-ఫోకస్, ఆటో-కీస్టోన్ కరెక్షన్ ఫీచర్లతో వస్తుంది. అంటే.. దీన్ని ఆన్ చేయగానే స్క్రీన్ ఆటోమేటి్చుక్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. దీని బరువు కూడా చాలా తక్కువ.

HY320 Smart Projector

ఇక తక్కువ ధరలో కావాలనుకునే వారికి దాదాపు రూ.5,000 లోపు లభించే ‘HY320 స్మార్ట్ ప్రొజెక్టర్’ మంచి ఆప్షన్. ఇది ఆండ్రాయిడ్ 13, వై-ఫై 6 సపోర్ట్‌తో 200 ఇంచుల స్క్రీన్‌ను అందిస్తుంది. బ్రైట్‌నెస్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ.. చీకటి గదుల్లో క్యాజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

కొనే ముందు ఏం చూడాలి?

మంచి ప్రొజెక్టర్ ఎంచుకునేటప్పుడు కనీసం 1080p రిజల్యూషన్, 200 నుండి 450 ANSI ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ ఉండేలా చూసుకోవాలి. అలాగే గూగుల్ టీవీ లేదా ఆండ్రాయిడ్ టీవీ ఉంటే వేరే డివైజ్‌లు కనెక్ట్ చేసే అవసరం ఉండదు. బడ్జెట్ ప్రొజెక్టర్లు చీకటి గదుల్లో బాగా పనిచేస్తాయి. కాబట్టి.. మీ అవసరాలకు సరిపోయే మోడల్‌ను ఎంచుకుని హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయండి.

Also Read: గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×