Poco M8 Power, Poco X8: ప్రముఖ టెక్ బ్రాండ్ పోకో మొబైల్స్‌కు ఇండియన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించే ఈ సంస్థ.. త్వరలోనే దేశీయ మార్కెట్లోకి రెండు సరికొత్త ఫోన్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అవే Poco M8 Power, Poco X8. ఈ ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చైనాలో ఇటీవలే విడుదలైన Redmi Note 17, Redmi Note 17 Pro మోడళ్లకు రీబ్రాండెడ్ వర్షన్‌లుగానే ఈ పోకో ఫోన్లు భారత్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ వెల్లడించారు. అంటే.. చైనా రెడ్‌మీ ఫోన్లలో ఉన్న ఫీచర్లే దాదాపు ఈ కొత్త పోకో ఫోన్లలోనూ ఉండే అవకాశం ఉంది. అయితే, ధరల విషయంలో మాత్రం ఇవి రెడ్‌మీ ఫోన్ల కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!
మరో సమాచారం ప్రకారం.. Poco X8 మోడల్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఉండనుంది. ఇక Poco M8 పవర్ విషయానికి వస్తే.. దీనిలో భారీ 8000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. తద్వారా బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను వాడనున్నట్లు తెలుస్తోంది.
తాజా లీక్స్ ప్రకారం చూస్తే.. ఈ రెండు ఫోన్లు ఈ త్రైమాసికంలోనే (ఈ కొన్ని వారాలు లేదా నెలల్లో) భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చైనాలో ఇప్పటికే విడుదలైన రెడ్‌మీ నోట్ 17 ప్రారంభ ధర రూ.18,000గా ఉంది. మరి మన దేశంలో ఈ పోకో ఫోన్ల ధరలను సంస్థ ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి.
Also Read: iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!