Oppo K15: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. చైనా మార్కెట్లో ఇప్పటికే సందడి చేస్తున్న K15 Pro, K15 Pro+ మోడల్స్ సరసన ఇప్పుడు సరికొత్త Oppo K15 చేరబోతోంది. ఈ లైనప్‌లో మూడో ఫోన్‌గా వస్తున్న ఒప్పో K15 వచ్చే వారం చైనాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక లిస్టింగ్ కూడా కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రత్యక్షమైంది.
ఈ సరికొత్త Oppo K15 స్మార్ట్‌ఫోన్ జులై 24న ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు) చైనాలో విడుదల కానుంది. ప్రస్తుతం అక్కడ ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. ఇది కనీసం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు గేల్ గ్రే, రాపిడ్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.
Also Read: బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!
ఈ ఫోన్ 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. ధూళి, నీటి నుండి రక్షణ కోసం దీనికి ఐపీ69 రేటింగ్ ఇచ్చారు. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోసం దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌ను వాడారు. గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు టైడల్ ఇంజిన్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, అలాగే 4,950 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ‘గ్లేసియర్ బ్యాటరీ ఎనర్జీ గ్యాదరింగ్’ చిప్‌ను కూడా ఇందులో ఉపయోగించారు.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, మరో 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అందించడం విశేషం. ఖచ్చితమైన నావిగేషన్ కోసం ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, బేదూ సపోర్ట్‌తో వస్తోంది.
Also Read: బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Lava Virat V1 సిరీస్ ప్రత్యేకతలు ఇవే!