Boat Overturns in Bagmati River: బీహార్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో 40 మందితో వెళ్తున్న ఓ పడవ బోల్తా కొట్టింది. ఓవర్ లోడ్ కారణంగా ఈ పడవ బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో బాగ్మతీ నదిలో ( Bagmati River) ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా (Boat Overturns) పడింది. కెపాసిటీ కంటే ఎక్కువగా అంటే 40 మంది ప్రయాణికులను పడవలో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో ఓవర్ లోడై నదిలోనే బోల్తా కొట్టింది పడవ. ఈ సంఘటన జరగగానే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించారు. నదిలో పడ్డ వాళ్లను గజ ఈతగాళ్లతో కాపాడారు. దీంతో పెను విషాదమే తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజెన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
బీహార్ లోని బాగ్మతీ నదికి ఇరువైపులా చాలా గ్రామాలే ఉన్నాయి. ఈ గ్రామాలు ఎలాంటి అవసరాల కైనా కచ్చితంగా నది దాటాల్సిన పరిస్థితిలు ఉంటాయి. ఈ నదిపై ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణం చేయలేదు అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కేవలం పడవలపై ఆధారపడిపోతున్నారు. విద్యార్థులు, రైతులు, గ్రామస్తులు ఇలా ఎవ్వరైనా సరే… తమ రాకపోకలకు పడవలను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. పడవల సంఖ్య కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో వాటి ఓనర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను అందులో తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా 40 మందిని తీసుకువెళ్లిన పడవ యాజమాని… ప్రమాదానికి కారణమయ్యాడు.
బాగ్మతీ నదిలో ( Bagmati River) పడవ ప్రమాదం జరిగిన నేపథ్యంలో రంగంలోకి పోలీసులు దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్ష చేశారు. దీనిపై సమీక్షించి.. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నది కూడా ప్రయాణించే వాళ్లకు కచ్చితంగా లైఫ్ జాకెట్లు.. లైఫ్ బాయ్స్ లాంటి ప్రాణ రక్షణ పరికరాలు ఉండాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. అటు ఈ సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ప్రమాదాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాగ్మతీ నది ( Bagmati River) పై బ్రిడ్జి నిర్మాణం పై పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఘటన స్థలానికి ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రం చేరుకోలేదు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !