E-Paper
Advertisement

Sanju Samson: సూర్య‌కు బిగ్ షాక్‌..టీమిండియా కొత్త కెప్టెన్ గా సంజు !

Sanju Samson: సూర్య‌కు బిగ్ షాక్‌..టీమిండియా కొత్త కెప్టెన్ గా సంజు !
Advertisement

Sanju Samson:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 )  విజేతగా టీమిండియా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ లో తలపడ్డాయి. ఇందులో 96 పరుగులు తేడాతో ఇండియా విజయం సాధించి, ముచ్చటగా మూడవసారి టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. అయితే టి20 వరల్డ్ కప్ గెలవడం వెనక సూర్య భాయ్ కంటే ఎక్కువ కృషి చేసింది సంజు శాంసన్ ( Sanju samson). దీంతో టి20 కెప్టెన్ గా సంజు శాంసన్ ను చేయాలని డిమాండ్లు వినిపిస్తుంది.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

టి20 కెప్టెన్ గా సంజు శాంసన్ అయ్యే ఛాన్స్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన సంజు శాంసన్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందులో భాగంగానే అతన్ని టీమిండియా టి20 కెప్టెన్ చేస్తారని అంటున్నారు. అభిమానులు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి ఒకరిని కచ్చితంగా టీమిండియా కెప్టెన్ గా చేయాలని కోరుతున్నారు. అయితే ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించారు. సూర్య కుమార్ యాదవ్ ఫిట్ గా ఉన్నన్ని రోజులు కెప్టెన్ గా కొనసాగుతాడని తెలిపారు. ఎప్పుడైతే అతడు విఫలమవుతాడో.. అప్పుడు కచ్చితంగా సంజు శాంసన్ కు అవకాశం రాబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు మహమ్మద్ కైఫ్.

ఏదో ఒక రోజు టి20 టీమిండియా కెప్టెన్ గా సంజు శాంసన్ అవుతాడని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు మహమ్మద్ కైఫ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా చేసిన అనుభవం సంజు శాంసన్ కు బాగానే ఉందని గుర్తు చేశారు కైఫ్. ప్రపంచ కప్ 2026 లో సంజు శాంసన్ అద్భుతంగా ఆడి.. టీమిడియాకు టైటిల్ తీసుకువచ్చాడని ప్రశంసించారు. ప్రస్తుతం టీమిండియాను నడిపించే సత్తా సంజు శాంసన్ కు ఉందని కొనియాడారు మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif ). ఇక మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో సంజు శాంసన్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

టి20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ విజేతగా సంజు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విజేతగా సంజు శాంసన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో సంజు శాంసన్ ఆడింది కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే. ఇందులో మూడు మాత్రమే అత్యంత భయంకరంగా ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు చేసిన సంజు శాంసన్, సెమీ ఫైనల్ లో 89 పరుగులు సాధించాడు. ఇక సూపర్ 8 లో 97 పరుగులతో రాణించాడు సంజు శాంసన్. ఇలా మొత్తంగా 321 పరుగులు సాధించి టీమిండియాను విజేతగా నిలిపాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చింది.

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×