Bajaj Apple Sale: గ్యాడ్జెట్ ప్రియులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ ‘బజాజ్ ఎలక్ట్రానిక్స్’ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ప్రజల కోసం ప్రత్యేకంగా ‘యాపిల్ డేస్’ (Apple Days) సేల్‌ను ప్రకటించింది. జూన్ 5 నుండి జూన్ 15 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ డేస్ సేల్లో భాగంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ క్రేజీ ఆఫర్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ లను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ ఉత్పత్తులను నిర్దేశిత బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. రూ.9000 వరకూ క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అలాగే పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకునే వారు.. రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుకోవచ్చు. అదే విధంగా.. ఎలాంటి అదనపు భారం లేకుండా 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) సదుపాయాన్ని సైతం బజాజ్ ఎలక్ట్రానిక్స్ కల్పిస్తోంది. ఐఫోన్ సిరీస్ పై నెలకు రూ. 1,206 ప్రారంభ ధరతో ఈఎంఐ మెుదలు కానున్నట్లు బజాజ్ వర్గాలు వెల్లడించాయి.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ అందిస్తున్న అన్ని ఆఫర్లు గరిష్టంగా వర్తిస్తే.. ఐఫోన్ ప్రారంభ ధర రూ.19,700కి దిగిరానున్నట్లు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. అటు ల్యాప్ టాప్ ప్రియుల కోసం నెలకు రూ.1,596 ఈఎంఐతో మ్యాక్ బుక్ సిరీస్ ను సొంతం చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు తెలిపింది. మరోవైపు విద్యార్థులు.. ఐప్యాడ్ ను నెలకు రూ.1,354 ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చని సూచించింది. వీటితో పాటు యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ (AirPods) పై కూడా ఆకర్షణీయమైన డీల్స్ సైతం బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!
యాపిల్ సేల్ సందర్భంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ కరణ్ బజాజ్ మాట్లాడారు. తమ కస్టమర్లు ఎంతో ఇష్టపడే యాపిల్ ఉత్పత్తులను అతి తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో యాపిల్ సేల్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పరిమిత కాలం పాటు మాత్రమే ఉండే ఈ ఆఫర్లను ఏపీ, తెలంగాణ వాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 200పైగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లకు వెళ్లి ఈ యాపిల్ సేల్ లో పాల్గొనవచ్చని సూచించారు. తద్వారా ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కరణ్ బజాజ్ కోరారు.
Also Read: సీఎం ఫ్యూచర్ కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడతావా? ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు