E-Paper
Advertisement

Best Earbuds March 2026: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారమంతా వాడొచ్చు.. ఈ ట్రెండింగ్ ఇయర్‌బడ్స్‌పై ఓ లుక్కేయండి బాస్!

Best Earbuds March 2026: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారమంతా వాడొచ్చు.. ఈ ట్రెండింగ్ ఇయర్‌బడ్స్‌పై ఓ లుక్కేయండి బాస్!
Advertisement

Best Earbuds March 2026: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి దగ్గర కచ్చితంగా ఉండే గ్యాడ్జెట్ ఏదని అంటే.. కళ్లు మూసుకుని చెప్పేయొచ్చు ఇయర్‌బడ్స్ అని. ప్రస్తుతం మన లైఫ్‌స్టైల్‌లో ఇవి ఓ భాగమైపోయాయి. ఆఫీస్ మీటింగ్‌లు ఉన్నా, ట్రావెలింగ్‌లో పాటలు వినాలన్నా లేదా జిమ్‌లో వర్కౌట్ చేయాలన్నా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాము. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో ఏ ఇయర్‌బడ్స్ ట్రెండ్ అవుతున్నాయి? ఏవి కొంటే బెస్ట్? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దామా..

Apple AirPods Pro 3

మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే మీకు ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కి మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. ఇందులో ఈసారి అదిరిపోయే ఫీచర్ ఇచ్చారు. అదేంటంటే.. సరికొత్త హార్ట్ రేట్ సెన్సార్. దీనివల్ల పాటలు వింటూనే మీ హెల్త్‌ని కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికొస్తే.. పాత మోడల్స్ కంటే ఇది చాలా పవర్‌ఫుల్. బయటి శబ్దాలను 90 శాతం వరకు అడ్డుకుంటుంది కాబట్టి, ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.

Sony WF-1000XM6

Advertisement

మ్యూజిక్ క్వాలిటీ విషయంలో సోనీ రూటే వేరు. కొత్తగా వచ్చిన XM6 మోడల్‌ను ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసమే డిజైన్ చేశారు. ఇందులో ఏకంగా ఎనిమిది మైక్రోఫోన్లు ఉంటాయి. దీనివల్ల మీరు రద్దీగా ఉండే ప్లేస్‌లో ఉండి కాల్ మాట్లాడినా, అవతలి వారికి మీ వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. మీరు గనుక మ్యూజిక్ లవర్స్ అయితే కళ్లు మూసుకుని దీనికి ఓటు వేయొచ్చు.

Bose QuietComfort Ultra Gen 2

ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారా? అయితే ఈ బోస్ ఇయర్‌బడ్స్ మీకు పర్ఫెక్ట్ జోడీ. ఇందులో ఉన్న ‘ఇమ్మర్సివ్ ఆడియో’ టెక్నాలజీ వల్ల ఏదో థియేటర్‌లో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మార్కెట్లో ఉన్న ఇతర బడ్స్ కంటే దీని నాయిస్ క్యాన్సిలేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని టెక్ నిపుణులు కూడా చెబుతున్నారు.

Advertisement

Also Read: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్స్, ఐఫోన్ రేంజ్ డిస్‌ప్లే!

Samsung Galaxy Buds 4 Pro

శాంసంగ్ తన కొత్త సిరీస్‌లో AI ఫీచర్లతో మ్యాజిక్ చేసింది. ఈ బడ్స్ పెట్టుకున్నప్పుడు ఫోన్ ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. కేవలం తల ఊపితే చాలు కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. అలాగే వాయిస్ కమాండ్స్‌తో పనులు చక్కబెట్టేయొచ్చు. మీరు గెలాక్సీ ఫోన్ వాడుతుంటే ఇవి మీకు బాగా సెట్ అవుతాయి.

Beats Powerbeats Pro 2

జిమ్‌కి వెళ్లేవారికి, రన్నింగ్ చేసేవారికి ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. చెవికి గట్టిగా పట్టుకుని ఉండే వింగ్ టిప్ డిజైన్ వల్ల మీరు ఎంత వేగంగా పరిగెత్తినా ఇవి అస్సలు కింద పడవు. ఇందులో కూడా హార్ట్ రేట్ సెన్సార్ ఉండటం వర్కౌట్ చేసేవారికి ఒక పెద్ద ప్లస్ పాయింట్.

Noise Master Buds

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కావాలనుకునే వారికి నాయిస్ కంపెనీ అదిరిపోయే ఆప్షన్ ఇస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 44 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. తక్కువ ధరలో మంచి సౌండ్ క్వాలిటీ ఇచ్చే ప్రొడక్ట్ కోసం చూసే మిడిల్‌క్లాస్ యూజర్లకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు.

JBL Live Beam 3

జేబీఎల్ తన కొత్త ఇయర్‌బడ్స్ కేస్‌పై టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చి అందరినీ షాక్ ఇచ్చింది. అంటే మీరు ఫోన్ తీయకుండానే ఆ కేస్ మీదున్న స్క్రీన్‌తో వాల్యూమ్ పెంచడం, సాంగ్స్ మార్చడం వంటివి చేయొచ్చు. దీనికి తోడు 48 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉండటం మరో విశేషం.

Also Read: రూ.11వేలకే అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ ఫోనా? ఫీచర్లు చూస్తే మతి పోతుంది!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×