iQOO 15 Alternatives| ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 15 ఇటీవలే ఇండియాలో లాంచ్ అయింది. దీని పర్ఫామెన్స్, కెమెరా చాలా బాగున్నాయి. కానీ దాదాపు అదే ధర లేదా అంతకంటే తక్కువ ధరలో మరింత మెరుగైన ఫ్లాగ్‌షిప్ ఆప్షన్స్ మార్కెట్‌లో ఉన్నాయి.
ఐకూ 15 ధర కంటే వివో X200 FE ధర చాలా తక్కువ. వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ లో 6.31 ఇంచుల LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 10 బిలియన్ కలర్స్ చూపిస్తుంది, 120Hz స్మూత్‌గా రిఫ్రెష్ రేటే ఉంటుంది. కెమెరా 50MP + 50MP + 8MP, సెల్ఫీకి కూడా 50MP లెన్సులున్నాయి. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 6500 mAh పెద్ద బ్యాటరీ ఉంది. అతి తక్కువ ధరలో మంచి సేవింగ్స్ చేసుకుంటూ పవర్‌ఫుల్ ఫోన్ కావాలంటే ఇది సూపర్ ఛాయిస్.
ఈ రేంజ్ లో శాంసంగ్ గెలాక్సీ S25 చాలా చిన్నది, పాకెట్‌లో సులువుగా పడుతుంది. ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల Dynamic AMOLED స్క్రీన్, 2600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఏ పనైనా ఎటువంటి లాగ్ లేకుండా చేస్తుంది. బ్యాటరీ 4000 mAh మాత్రమే కానీ శాంసంగ్ ఆప్టిమైజేషన్ వల్ల రోజంతా సులువుగా పనిచేస్తుంది. శాంసంగ్ ఫ్యాన్స్‌కి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ బెస్ట్.
షావోమీ 15లో ముందు వెనుక అదిరిపోయే కెమెరాలున్నాయి. మూడు 50MP రియర్ (వెనుకవైపు) + 32MP సెల్ఫీ కెమెరాలున్నాయి. 6.36 ఇంచుల LTPO AMOLED డిస్‌ప్లే 68 బిలియన్ కలర్స్ చూపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5240 mAh బ్యాటరీ ఉన్నాయి. కెమెరా ప్రియులకు టాప్ ఛాయిస్.
వన్‌ప్లస్ 15ని ఒకప్పుడు “ఫ్లాగ్‌షిప్ కిల్లర్” అని పిలిచేవారు, ఇప్పటికీ అదే స్పీడ్! మూడు 50MP కెమెరాలు, 32MP సెల్ఫీ. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 6000 mAh భారీ బ్యాటరీ, 100W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. స్పీడ్ + బ్యాటరీ కలిపి కావాలంటే ఇదే బెస్ట్.
ఒప్పో ఫైండ్ X9 లో 6.59 ఇంచుల పెద్ద AMOLED డిస్‌ప్లే, గాజు బలమైన గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. మూడు 50MP కెమెరాలు, 32MP సెల్ఫీ. డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 7025 mAh దిమ్మతిరిగే బ్యాటరీ ఉంది. రెండు రోజులు ఈజీగా నడిచే ఫోన్ కావాలంటే ఇది పర్ఫెక్ట్.
కెమెరా లవర్స్‌కి రియల్ మి GT 8 ప్రో రాజు! 200MP ప్రధాన కెమెరాతో పాటు మరో రెండు 50MP కెమెరాలున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 చిప్, 7000 mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ ఉన్నాయి. జూమ్ ఫోటోలు, ప్రొఫెషనల్ షాట్స్ కావాలంటే ఇది నంబర్ 1.
60-80 వేల బడ్జెట్‌లో iQOO 15 కంటే బెస్ట్ ఫోన్ కావాలంటే –
తక్కువ ధరలో టాప్ ఫీచర్స్ – Vivo X200 FE
కాంపాక్ట్ + ప్రీమియం – Samsung Galaxy S25
అదిరిపోయే కెమెరా – Xiaomi 15 లేదా Realme GT 8 Pro
బెస్ట్ బ్యాటరీ కావాలంటే – Oppo Find X9
స్పీడ్ + బ్యాలెన్స్ విషయంలో OnePlus 15 బెటర్.
మీ అవసరం ప్రకారం ఈ ఆరు ఫోన్లలో ఒకటి కచ్చితంగా ఐకూ 15 కంటే బెటర్ ఆప్షన్ అవుతుంది!
Also Read: దేశ సరిహద్దులను కాపాడేందుకు రోబో సైనికులు.. స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాయి