E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కారుకు అడ్డుగా వచ్చిన పులి 

Nindu Noorella Saavasam Serial Today December 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కారుకు అడ్డుగా వచ్చిన పులి 

Nindu Noorella Saavasam Serial Today Episode:  

రామ్మూర్తి వాళ్ల ఊరికి వెళ్తున్న మిస్సమ్మ వాళ్లు ఫారెస్ట్‌లో ఇరుక్కుపోతారు. ఒక దగ్గర కొంత మంది రౌడీలు రాళ్లు అడ్డుగా పెట్టి రోడ్డు డైవర్షన్‌ తీసుకోమనే బోర్డు పెడతారు. అదంతా చూసిన రాథోడ్‌ నాకేదో అనుమానంగా ఉంది అంటే అదంతా రణవీరే చేయిస్తున్నాడనుకున్న మనోహరి మాత్రం ప్రభుత్వం పెట్టిన బోర్డులు రాళ్లు చూసి అనుమానంగా ఉందంటావేంటి రాథోడ్‌ అంటుంది. ఇదంతా ఎందుకు ముందు ఆయనకు ఫోన్‌ చేయ్‌ రాథోడ్‌ అని మిస్సమ్మ చెప్పగానే.. అమర్‌కు ఫోన్‌ చేయడానికి జేబులోంచి ఫోన్‌ తీస్తాడు రాథోడ్‌. ఫోన్‌ సిగ్నల్‌ ఉండవు.. అదే విషయం చెప్పగానే.. మనోహరి ఇరిటేటింగ్‌గా మనం సిటీ దాటి చాలా దూరం వచ్చాము.. సిగ్నల్స్‌ ఎలా ఉంటాయి ఇక్కడ అని చెప్పగానే అందరూ కంగారు పడుతుంటారు. ఇంతలో మంగళ భయంగా అయితే వెనక్కి వెళ్దాం అంటుంది. దీంతో రామ్మూర్తి కోపంగా ఎక్కడికి వెనక్కి వెళ్లేది. మనం ఊరుకు వెళ్లాలి అంటాడు.

అయ్యో ఊరు వెళ్లాలి అంటే దారి ఉండాలి కదండి అంటుంది మంగళ. దీంతో చంభా అటు దారి ఉంది కదా మేడం అటు వెళ్దాం అంటుంది. ఈ దారి సేఫ్‌ కాదు ముందుకు వెళితే డీప్‌ ఫారెస్ట్‌ వస్తుంది అని రాథోడ్‌ చెప్పగానే.. అడవి వస్తే ఏంటి దారి అయితే ఉంటుంది కదా అని మనోహరి చెప్పగానే.. రాథోడ్‌ ఇరిటేటింగ్‌ గా మేడం అడవిలో ఎటని వెళ్తాం.. పైగా ఈ రోడ్డు చూస్తుంటే.. ఒక్క వెహికిల్‌ కూడా అటు నుంచి కానీ ఇటు నుంచి కూడా వెళ్తున్నట్టు కనిపించడం లేదు అంటాడు రాథోడ్‌. దీంతో మనోహరి ఆర్మీలో పని చేస్తూ ఇంతలా భయపడతావేంటి..? మనం ఇలాగే లేట్‌ చేస్తే చీకటి పడుతుంది. అందుకైనా ఈ రోడ్డు గుండా వెళ్తే మేయిన్‌ రోడ్డు వస్తుంది. అది బెటర్‌ కదా..? అనగానే రాథోడ్‌ కోపంగా మేడం ఈ రోడ్డు గుండా వెళితే మెయిన్‌ రోడ్‌ వస్తుందని అంత గ్యారంటీ ఏంటి..? ఆడవాళ్లను చిన్నపిల్లలను పెట్టుకుని అడవిలో అంత రిస్క్‌ చేయలేం మేడం.. అయినా ఈ దారిలో ముందు ముందు ఏమోస్తుందో ఎవరికి తెలుసు..? అంటాడు. అయితే ఇప్పుడు ఏమంటారు..? వెనక్కి వెళ్లిపోదామా..? భాగీ సీమంతం ఆపేద్దామా..? అంటుంది మనోహరి.

దీంతో చంభా అలియాస్‌ యాదమ్మ కల్పించుకుని లేదు లేదు.. మేడం సీమంతం జరగాల్సిందే.. లేదంటే రామ్మూర్తి సార్‌ బాధపడతారు. రాథోడ్‌ గారు ఏమీ కాదండి.. దైర్యంగా ముందుకు వెళ్దాం.. అని చెప్పగానే.. రామ్మూర్తి కూడా అవును రాథోడ్‌ ఇటే వెళ్దాం.. మనోహరి చాలా ధైర్యంగా చెప్తుంది కదా..? ముందు మేము వెళ్తాము.. మీరు వెనకాల రండి అని రామ్మూర్తి చెప్పగానే.. ముందు నా కారు నడపాలా..? అని మనోహరి భయంగా అడుగుతుంది. దీంతో రామ్మూర్తి అవునమ్మా.. నువ్వే ఏంటమ్మా మనోహరి ఆలోచిస్తున్నావు.. రాథోడ్‌కు ధైర్యం లేదన్నావు.. ఇప్పుడు ముందుకు వెళ్లడానికి నీకు కూడా ధైర్యం  సరిపోవడం లేదా..? అని అడగ్గానే.. రణవీర్‌ అడవిలో ఎలాంటి ప్లాన్‌ వేశాడో తెలియదే.. వెళ్తే నాకేం ప్రమాదం వస్తుందో అని మనసులో అనుకుంటుంది మనోహరి..

ఇక చంభా భయంగా మొదటికే మోసం వస్తుంది మనోహరి ముందుకు వెళ్లడమే మంచిది అని మనోహరికి చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా ఎలా వెళ్తాం.. రణవీర్‌ ఎలాంటి ప్లాన్‌ చేశాడో మనకు తెలియదు.. ముందు వెళితే మనకే ప్రమాదం అని చెప్పగానే.. ఇంత చేసినోడు మనం ముందు వెళ్తున్నామని తెలసుకోలేడా..? మనకేం ప్రమాదం రానివ్వడు నా మాట విను.. అని చంభా చెప్తుండగానే.. ఏంటి మనోహరి మేడం ముందు వెళ్లడానికి మీకు  ధైర్యం రావడం లేదా..? అని రాథోడ్‌ అడగ్గానే.. మిస్సమ్మ కల్పించుకుని నాన్న ఇక మనం వెనక్కి వెళ్లిపోదాం.. సీమంతం సిటీలోనే చేసుకుందాం అంటుంది. దీంతో మనోహరి వద్దు వెళ్దాం పద నేను ముందు వెళ్తాను అని చెప్పగానే.. అందరూ కారెక్కి వెళ్లిపోతారు.

అడవిలో కొద్దిదూరం వెళ్లాక మనోహరి సడెన్‌గా కారు ఆపేస్తుంది. ఎందుకు మనోహరి మళ్లీ ఆపేశావు అంటూ రామ్మూర్తి అడుగుతాడు. మనోహరి చెప్పకుండా భయంగా చూస్తుంటుంది. రామ్మూర్తి ముందుకు చూసి షాక్‌ అవుతాడు. కారు ముందు పులి వచ్చి ఆగి ఉంటుంది. పులిని చూసి రామ్మూర్తి షాక్‌ అవుతాడు. ఇంతలో వెనక కారులో ఉన్న అంజు దిగి రామ్మూర్తి కారు దగ్గరకు వస్తుంది. అంజును చూసి రామ్మూర్తి కంగారుపడుతుంటాడు. పులి అంజు వైపు పరుగెత్తుకుంటూ వస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

పెళ్లి పేరుతో రూ.9కోట్లు చీటింగ్.. సీసీఎస్ విచారణ.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి!

మొగలిరేకులు సీరియల్ నటుడిపై రమాప్రభ ఫైర్.. ఏమైందంటే?

Tejeswini Gowda : యూట్యూబ్ ద్వారా తేజు నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనాల మధ్య ఆస్తి చిచ్చు.. బాలుకు ఘోర అవమానం.. బాలు కాపురంలో ప్రభా చిచ్చు..

Podarillu Today Episode : మాధవ్ కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం.. పెళ్లి వద్దనుకున్న మాధవ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన పెద్ది..

Nindu Noorella Saavasam Serial Today Episode April 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి గురించి నిజం తెలుసుకున్న రణవీర్    

Karthika Deepam 2 Serial Today Episode April 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచనకు నిజం చెప్పబోయిన కార్తీక్  

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పేసిన భాగ్యం.. ధీరజ్ పంచ్ అదిరిపోలే.. ఆనందారావుకు చెమటలు..ఇదేం ట్విస్ట్.

Big Stories

×