E-Paper
Advertisement

Palnadu Crime: పల్నాడులో జంట హత్యలు.. అక్క కళ్లల్లో ఆనందం కోసం, నిందితులు ముగ్గురు మైనర్లు

Palnadu Crime: పల్నాడులో జంట హత్యలు.. అక్క కళ్లల్లో ఆనందం కోసం, నిందితులు ముగ్గురు మైనర్లు
Advertisement

Palnadu Crime:  దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. అది దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి ఘటన ఒకటి పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. అక్కను.. బావ-అత్తమ్మలు వేధించడం తట్టుకోలేకపోయాడు ఆమె తమ్మడు. వీరికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావించాడు. పక్కాగా ప్లాన్ చేసింది బావ-అత్తమ్మను వెంటాడి మరీ చంపేశాడు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

పల్నాడు జిల్లాలో జంట హత్యలు

Advertisement

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జంట హత్యలు జరిగాయి. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన సాంబశివరావు.. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సాహితీతో రెండేళ్ల కిందట పెళ్లి జరిగింది. వివాహం జరిగి రెండేళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదని సాహితీని నిత్యం వేధిస్తూ ఉండేవాడు భర్త సాంబశివరావు.

దీంతో ఆరు నెలల కిందట సాహితీ విడాకులు తీసుకుంది. తనకు అత్తింట్లో జరిగిన అకృత్యాల గురించి తన తల్లితో చెప్పేది సాహితి. ఆ విషయాలు సాహితి సోదరుడు రోహిత్ తెలిసింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయేవాడు. ప్రస్తుతం రోహిత్ పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. అక్కను బావ, ఆమె తల్లిపై కక్ష పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

Advertisement

అక్క కళ్లల్లో ఆనందం కోసం, నిందితులంతా మైనర్లు

ఈ క్రమంలో తన ఇద్దరు ఫ్రెండ్స్‌ రవికుమార్‌, షేక్‌ జావెద్‌ ఇస్లాంతో కలసి ఆదివారం మధ్యాహ్నం బావ సాంబశివరావు ఇంటికి వెళ్లాడు రోహిత్. మంచంపై పడుకున్న బావ సాంబశివరావును అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అడ్డొచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారి‌ని వదల్లేదు. ఆమెని కూడా నరికేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న సత్తెనపల్లి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకుల్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాల పాలైన కృష్ణకుమారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుల్లో రోహిత్‌ చౌదరి పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.

ALSO READ:  కాచిగూడ ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్, స్పాట్‌లో బైకర్ మృతి

మరో ఇద్దరు రవికుమార్‌, జావెద్‌ ఇస్లాంలు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులు మైనర్లు. వారి వెంట తెచ్చుకున్న మారణాయుధాలను చూసి పోలీసులు షాకయ్యారు. కేవలం అక్క కళ్లల్లో ఆనందం కోసం బావ సాంబశివరావు, ఆమె తల్లిని హత్య చేసినట్టు రోహిత్‌ చౌదరి చెప్పాడు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×