Vivo X300 Alternatives| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వివో X300 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు విడుదల చేసింది. కానీ 2025లో X300 సిరీస్ కంటే బెటర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈఫోన్లు అద్భుతమైన పనితనం, భారీ బ్యాటరీ, సూపర్ కెమెరాలు, బ్రైట్ డిస్‌ప్లే లాంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ ఒకసారి పరిశీలించండి.
ఐకూ 15లో 7000 mAh భారీ బ్యాటరీ ఉంది, 100W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుకభాగంలో 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా, ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.85 అంగుళాల LTPO డిస్‌ప్లే, 6000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. బయట ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో సూపర్ ఫాస్ట్ పనిచేస్తుంది, OriginOS 6 సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఈ ఫోన్ రన్ అవుతుంది.
వన్‌ప్లస్ 15లో ఇంకా పెద్ద 7300 mAh బ్యాటరీ ఉంది! స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ చిప్‌తో ఇది అదిరిపోయే పర్‌ఫామెన్స్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 + OxygenOS 16 సాఫ్ట్‌వేర్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. 6.78 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, వెనుక మూడు 50MP కెమెరాలు, ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ప్రతి రోజూ హెవీ యూజ్ కోసం ఇందులోని లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉపయోగపడుతుంది!
రియల్‌మి GT8 Proలో 6.79 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది, 144Hz రిఫ్రెష్ రేట్, 7000 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. దీని కెమెరా అద్భుతం. 50MP మెయిన్ + 200MP లెన్స్ (మొబైల్‌లో అతి ఎక్కువ రిజల్యూషన్) + 50MP ట్రిపుల్ సెటప్. ఫోటోలు, జూమ్, పోర్ట్రెయిట్ అన్నీ సూపర్‌గా వస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ గేమింగ్ కూడా టాప్ లెవెల్.
శాంసంగ్ గెలాక్సీ S25 Plusలో 6.7 అంగుళాల Dynamic AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కెమెరా 50MP + 10MP + 12MP వెనుక, 12MP సెల్ఫీ. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ చిప్, 4900 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్. శాంసంగ్ యూజర్లకు One UI సాఫ్ట్‌వేర్, 7 ఏళ్ల అప్‌డేట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ యూజ్ కోసం ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.
ఒప్పో ఫైండ్ X9లో 7500 mAh బ్యాటరీ (ఈ లిస్ట్‌లోనే అతి పెద్దది), మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ ఉన్నాయి. 6.78 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, బిలియన్ కలర్స్, డాల్బీ విజన్. కెమెరా సెటప్ చూస్తే.. వెనుకవైపు 50MP + 200MP + 50MP, ముందుభాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు కూడా బెస్ట్ క్లారిటీగా వస్తాయి.
మీకు భారీ బ్యాటరీ కావాలాంటే వన్ ప్లస్ 15 లేదా ఒప్పో ఫైండ్ X9 బెటర్. టాప్ క్లాస్ కెమెరా కావాలాంటే రియల్‌మి GT8 ప్రో లేదా ఒప్పో ఫైండ్ X9 కొనుగోలు చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ మీ ప్రాధాన్యమనిపిస్తే.. శాంసంగ్ S25 ప్లస్ బెటర్ ఆప్షన్. ఈ ఫోన్లు 2025లో వివో X300కి బెస్ట్ ఆల్టర్నేటివ్స్!
Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన