E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు ఎదురుగా వచ్చిన పులి 

Nindu Noorella Saavasam Serial Today December 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు ఎదురుగా వచ్చిన పులి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

అడవిలో రౌడీలు వచ్చి అడ్డగించి రాథోడ్‌ను కొట్టడంతో మిస్సమ్మ, పిల్లలను అక్కడి నుంచి పారిపోమ్మని రాథోడ్‌ చెప్తాడు. దీంతో అందరూ తలో దిక్కు పారిపోతారు. వెనకాలే రౌడీలు తరుముతుంటారు. పట్టుకోవడానికి పరుగెడుతుంటారు. యమలోకంలో ఉన్న ఆరుకు మనసు భారంగా అనిపిస్తుంది. కంగారుగా గుప్త దగ్గరకు వెళ్లి నా వాళ్లకు ఏదో ఆపద వచ్చినట్టు ఉంది వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్తుంది. దీంతో మాయాదర్పణం లో చూసిన గుప్త షాక్‌ అవుతాడు. నీ మనసుకు ఎంతటి మహత్తు ఉన్నది బాలిక. జరుగుచున్నది మేమే పసిగట్టలేకపోయాము. నీ మనసుకు ఎలా తెలిసింది అని గుప్త అడగ్గానే.. ఆరు మాత్రం నేను వాళ్లను కాపాడాలి గుప్త గారు నన్ను వెంటనే కిందకు పంపించండి అని అడుగుతుంది.

దీంతో గుప్తు నువ్వు వెళ్లి ఏమీ చేయుదువు బాలిక నీకిప్పుడు ఎటువంటి శక్తులు లేవు కదా..? అని చెప్పగానే.. అవునా అయితే మీరైనా కాపాడండి.. గుప్త గారు అంటుంది ఆరు. దీంతో గుప్త ఈ విషయమున మేము కూడా అశక్తులమే బాలిక. ప్రభువుల వారి ఆజ్ఞ లేనిదే మేము ఏమీ చేయలేము.. చేయకూడదు అని చెప్తాడు. అయితే నన్ను కిందకు పంపించండి గుప్త గారు అని మళ్లీ అడుగుతుంది. దీంతో గుప్త నీకు శక్తులు లేకుండా నువ్వు ఏమి చేయుదువు బాలిక అంటాడు. ఆరు బాధగా నేను మా వాళ్లతో ఉన్నప్పుడు వాళ్లకు మంచి జరిగింది గుప్త గారు. నేనేం చేయకపోయినా పర్వాలేదు. నేను వాళ్లతో ఉంటే వాళ్లకు మంచే జరుగుతుంది అని చెప్పగానే.. అది నీ ఊహ మాత్రమే బాలిక ఎటుల జరుగునో అటులే జరుగును. నువ్వు ఈ విషయం వదిలివేయుము అంటాడు గుప్త.

Advertisement

దీంతో ఆరు ఏడుస్తూ.. మా వాళ్లు ఆపదలో ఉంటే ఎలా వదిలేయగలను. నా చెల్లెలు నిండు గర్బిణి గుప్త గారు. ఈరోజో రేపో ప్రసవిస్తుంది. తన కష్టం చూసి కూడా మీ మనసు కరగటం లేదా..? నా పిల్లుల చాలా చిన్న పిల్లలు వాళ్లు అలా అడవిలో అంతలా కష్టపడుతుంటే మీ కళ్లు చెమ్మగిల్లడం లేదా..?  ఆ వయసులో మా నాన్న కడుపుతో ఉన్న కూతురు కోసం మనవళ్లు, మనవరాళ్ల కోసం పడుతున్న ఆరాటం కనబడటం లేదా..? వాళ్లకు తోడుగా మా ఆయన కూడా లేరు అంటూ ఏడుస్తుంది. దీంతో గుప్త మళ్లీ మేమేమీ చేయలేము బాలిక అని చెప్పగానే.. మీరు చేయగలరు గుప్త గారు.. నన్ను కిందకు పంపిచేయవచ్చు కదా..? ఫ్లీజ్‌ గుప్త గారు ఇది ఒక చెల్లి తన అన్నయ్యను అడుగుతుంది అనుకోండి అంటూ చెప్పగానే.. గుప్త తనకు  ప్రభువుల వారి ఆజ్ఞ లేకుండా తానేమీ చేయలేను బాలిక అంటాడు. గుప్త ఎంత చెప్పినా ఆరు ఏడుస్తూ కాదనకండి మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ గుప్త  కాళ్లమీద పడుతుంది. ఫ్లీజ్‌ గుప్త గారు నాకు వేరే దారి లేదు. ఇప్పుడు మీరు తప్పా నాకు వేరే దిక్కు లేదు. నాకు ఎంతో సాయం చేశారు. ఇప్పుడు కూడా ఇదొక్క సాయం చేయండి ఫ్లీజ్‌ గుప్త గారు అని వేడుకుంటుంటే..

గుప్త అటులనే బాలిక. కానీ నిన్ను ఒంటరిగా పంపించుటకు మా మనసు ఒప్పుకోవడం లేదు. నీతో మేము వచ్చెదము అని చెప్పగానే.. ఆరు సంతోషంగా మీరు కూడా వస్తారా..? అని అడుగుతుంది. దీంతో గుప్త అవును ప్రభువుల వారు నన్ను ఏమనుకున్నను పర్వాలేదు. ఎటువంటి దండన విధించినను ఒక సోదరునిగా నీ కష్టమున పాలు పంచుకొనదెను. నీతో మేము భూలోకం వచ్చెదము.. అని చెప్పగానే.. ఆరు సంతోషంగా చాలా థాంక్స్‌ గుప్త గారు.. చాలా చాలా థాంక్స్‌ అని చెప్తుంది. గుప్త వెంటనే బాలిక ఈ రూపమున కాదు.. అరుంధతి రూపంలో వెళ్లాలి అని ఆరు గెటప్‌ మార్చేస్తాడు. ఇద్దరూ కలిసి ఫారెస్ట్‌లోకి వెళ్తారు. ఫారెస్ట్‌లో మిస్సమ్మ వెనకాలే కత్తి పట్టుకుని రౌడీ వెళ్తుంటాడు. ఇంతలో మిస్సమ్మకు ఎదురుగా పులి వస్తుంది. అప్పటికే మిస్సమ్మను కత్తితో చంపడానికి దగ్గరకు వెళ్లిన రౌడీ పులిని చూసి భయంతో పారిపోతాడు. మిస్సమ్మ పరుగెత్తలేక అలాగే ఉండి పోతుంది. పులి మిస్సమ్మ వైపు వస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×