E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తిరుపతిని మోసం చేసిన శ్రీవల్లి.. రామరాజుకు షాకిచ్చిన భద్ర.. తిరుపతిని గెంటేసిన రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: తిరుపతిని మోసం చేసిన శ్రీవల్లి.. రామరాజుకు షాకిచ్చిన భద్ర.. తిరుపతిని గెంటేసిన రామరాజు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది.. అమ్మద ఉంగరము ఆకైందమ్మ ఇప్పుడు నగలు కూడా ఆకలు అయితాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక పని చెయ్. నువ్వు వెళ్లి ఆ నగలు ఆకులయ్యేమో చూసి మళ్ళీ అందులోనే దాచి పెట్టేసేయని భాగ్యం సలహా ఇస్తుంది.. శ్రీవల్లి వెళ్లి ఆ నగలను చూసి నగలన్నీ బాగానే ఉన్నాయని మురిసిపోతూ ఉంటుంది. ఎదురుగా నర్మదా ప్రేమను చూసి షాక్ అవుతుంది.. నగలను తీసింది నువ్వే అని మాకు తెలుసు.. నీ అంతటి నువ్వే బయటపడాలని మేము ఒకతని తీసుకొచ్చాము. అతను బాబా కాదు అని నర్మదా అంటుంది. ఎంత మోసం చేశావు నగలను నీ దగ్గర పెట్టుకొని అందరినీ తిట్టేలా చేస్తావా అని ప్రేమ సీరియస్ అవుతుంది.. శ్రీవల్లి నేను చచ్చిపోతానని బెదిరించడంతో ప్రేమ నర్మదా ఇద్దరు కూడా కూల్ అవుతారు.. నువ్వే ఈ నగలని మావయ్య గారి దగ్గరికి ఇవ్వాలి అని ప్రేమ కండిషన్ పెడుతుంది. ఇవన్నీ తిరుపతిని వాడుకొని ఆ పని చేయాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నగలను తీసుకొని శ్రీవల్లి తిరుపతిని బురిడీ కొట్టించి రామ రాజుకు ఇవ్వమని అడుగుతుంది. తిరుపతి మొదట ఇలాంటి పెద్ద సాహసం నేను చేయను నా మీద తప్పు నిందపడుతుంది అని అంటాడు. శ్రీవల్లి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళ వేళ్ళ పడి మరి తిరుపతిని ఒప్పిస్తుంది.. ఇక రామరాజు రాగానే తిరుపతి శ్రీవల్లి ఆ నగలను ఇవ్వాలని అనుకుంటారు. రామరాజు వచ్చి ఇంట్లో కూర్చోగానే తిరుపతి నగలను తీసుకొని వస్తాడు. బావ ఇదిగో నగలని అంటాడు. ఏ నగలు ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అంటాడు.  ఏం నగలు అంటావేంటి ప్రేమ నగలు అని తిరుపతి అనగానే అందరూ షాక్ అవుతారు.

Advertisement

ఏం నగలు అంటావేంటి బావ ప్రేమ వే.. నీ దగ్గరికి ఎలా వచ్చాయిరా అందరూ తేలు కుట్టిన దొంగల్లాగా మారిపోయారు.. నగల గురించి నిజం చెప్పలేదు.. ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అనేసి తిరుపతిని రామరాజు అడుగుతాడు.. అంతే కాదు తిరుపతిని కొట్టడంతో శ్రీవల్లి ఎక్కడ నిజం చెప్తాడు అని భయపడుతుంది. ప్రేమకు పుట్టింటి ప్రేమ దక్కాలని నేనే ఇలా చేశాను అని అంటాడు. ఎలాగో తోడుగా లేరు కనీసం పుట్టింటి నుంచి వచ్చిన నగలు అయినా సరే తనకి తోడుగా ఉంటాయని అలా చేశాను.

తిరుపతి ఎంతగా చెప్పాలని చూసినా కానీ రామరాజు మాత్రం వినడు. శ్రీవల్లి బాబాయి గారికి ఇంత వయసొచ్చినా పెళ్లి అవ్వకపోయినా సరే ప్రేమని తన సొంత కూతురు లాగా చూసుకుంటున్నారు. ఆయన చేసిన దాంట్లో తప్పేమీ కనిపించట్లేదు మామయ్య అనేసి శ్రీవల్లి అంటుంది. వేదవతి కూడా మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ అవమానిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ నగల విషయంలో కూడా అలానే జరిగింది. వాడి తప్పేమీ లేదు క్షమించండి అని అడుగుతుంది.. కానీ రామరాజు మాత్రం వీటి గురించి నేను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు కదా.. వాళ్ల దగ్గర ఇదే మాట చెప్పు అనేసి అంటాడు.

Advertisement

Also Read: అవనికి దొరికిపోయిన పల్లవి.. పార్వతిని మార్చేసిన పల్లవి.. చక్రధర్ కు వార్నింగ్..

సరే బావా నేను వెళ్లి వాటి గురించి చెప్పి వాళ్ళకి ఇస్తాను అనేసి తిరుపతి అంటాడు. తిరుపతి భద్ర సేన అని పిలిచి నగలు ఇవిగోండి నేనే తీశాను అని చెప్తాడు. ఆ నగరం తీసుకొని బయటికి వచ్చిన భద్ర ఈ నగలు ముష్టేస్తున్నారా అనేసి మళ్లీ రివర్స్ అవుతుంది.. నాకు ప్రాణంగా ప్రేమించిన నా చెల్లి దూరమైంది.. నేను ప్రాణంగా పెంచుకున్న నా బిడ్డ లాంటి ప్రేమ దూరమైంది. వాళ్లిద్దరి లేనప్పుడు ఆఫ్ట్రాల్ ఈ నగలు నాకెందుకు మీరే ఉంచుకోండి అని వాటిని విసిరి పడేస్తుంది. ఇక ప్రేమ వాళ్ళమ్మ రేవతి ప్రేమకు ఈ నగలు నీవే నీ దగ్గరే ఉండాలి తీసుకో అని ఇస్తుంది. ఇక రామరాజు ఇంత మోసం చేసినవాడు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని తిరుపతిని బయటికి వెళ్ళమని చెప్తాడు. ఆ మాట వినగానే శ్రీవల్లితోపాటు అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×