Celebrity couples:సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎన్నో ప్రేమకథలు పుడుతుంటాయి, పెరుగుతుంటాయి. అయితే కొన్ని ప్రేమకథలు కేవలం ‘కట్’ చెప్పే వరకే పరిమితం కాకుండా, ఏడడుగుల బంధంతో జీవితాంతం తోడుగా నిలిచిపోతాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలా కెమెరా ముందు ప్రేమించుకుని, కెమెరా వెనుక పెళ్లి పీటలెక్కిన జంటలు ఎందరో ఉన్నారు. వారి ప్రయాణం ఎలా మొదలైందో, ఏ ఏ సినిమాలు వారిని కలిపాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
టాలీవుడ్ లో కోస్టార్స్ గా ఉండి పెళ్లి చేసుకున్న జంటల గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల. వీరిద్దరి ప్రయాణం 1967లో వచ్చిన ‘సాక్షి’ సినిమాతో మొదలైంది. దాదాపు 15కి పైగా చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించి మెప్పించారు. ఆ క్రమంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి, 1969లో వివాహం చేసుకున్నారు. నటిగానే కాకుండా విజయనిర్మల దర్శకురాలిగా కూడా కృష్ణ తో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు.
అక్కినేని నాగార్జున, అమల జంట అంటే తెలుగు ప్రేక్షకులకు అప్పట్లో ఒక క్రేజ్. కిరాయి దాదా, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సెట్స్ లో మొదలైన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి, 1992లో వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నేటికీ వీరు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ గా కొనసాగుతున్నారు.
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ లది ఒక అందమైన ప్రేమకథ. వీరిద్దరూ 2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమా షూటింగ్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. సుమారు ఐదేళ్ల పాటు తమ ప్రేమను గోప్యంగా ఉంచిన ఈ జంట, 2005లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
జీవిత, రాజశేఖర్ లది ఒక ప్రత్యేకమైన ప్రయాణం. వీరు ‘అంకుశం’, ‘ఆహుతి’, ‘మంచివారు మావారు’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి వివాహానికి దారితీసింది. పెళ్లి తర్వాత జీవిత నటనకు స్వస్తి చెప్పి, రాజశేఖర్ సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా వెన్నంటి ఉంటూ వస్తున్నారు.
హీరో శ్రీకాంత్, నటి ఊహ కలిసి నటించిన సినిమాలు తక్కువే అయినా, అవి వారి జీవితాలను మార్చేశాయి. ‘ఆమె’, ‘కూతురు’, ‘పాటబస్తీ’ వంటి సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. 1997లో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఊహ సినిమాలకు దూరమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు.
సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణల ప్రేమకథ చాలా వెరైటీగా ఉంటుంది. ‘చంద్రలేఖ’ సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఒకరినొకరు గౌరవించుకుంటూ 2003లో వివాహం చేసుకున్నారు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్రకు ఎంతో ప్రశంసలు దక్కాయి.
టాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే జంటల గురించి మాట్లాడుకుంటే మొదటగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గురించి చెప్పుకోవాలి. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా కాలంగా వీరి ప్రేమ గురించి చర్చలు నడుస్తుండగా, ఎట్టకేలకు వీరిద్దరూ 2026 ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వెండితెరపై ఈ జంటను చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు నిజ జీవితంలోనూ వారు తోడుగా ఉండటం చూసి ఎంతో సంతోషిస్తున్నారు.
అలాగే టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రయాణం అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్లది. వీరిద్దరి నిశ్చితార్థం నుంచే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ జరిగింది. గూఢచారి వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన శోభిత, చైతన్యలు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి.. 2024 డిసెంబర్ నెలలో వేడుకగా వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంటలు కూడా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహిస్తూనే, పెళ్లి బంధం లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరులది వృత్తిపరంగా అత్యంత విజయవంతమైన ప్రయాణం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం పనిచేశారు. ఒక నటిగా సమంతలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో రాజ్ నిడుమోరు దర్శకత్వం కీలక పాత్ర పోషించింది.
వీరిద్దరూ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
‘ఇంగ్లీష్‌కారన్’ అనే తమిళ్ సినిమా టైంలో వీరి పరిచయం మొదలైంది. ఆ తర్వాత వీరు 2009లో పెళ్లి చేసుకున్నారు.
‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట, సుదీర్ఘ కాలం ప్రేమలో ఉండి 2023లో పెళ్లి చేసుకున్నారు.
రీసెంట్ గా ‘ప్రతినిధి 2’ లో కలిసి నటించిన ఈ జంట కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడి 2016లో వివాహం చేసుకున్నారు.
‘రాజా వారు రాణి గారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ జంట, నిజ జీవితంలోనూ రాజా-రాణిలా 2024లో ఒక్కటయ్యారు.
సినిమా సెట్స్ లో కలుసుకుని, మనసులను పంచుకుని, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండేందుకు సిద్ధమైన ఈ సినీ జంటలు అందరికీ స్ఫూర్తిదాయకం.
ALSO READ:Tollywood: నటనతో కాదు సేవాగుణంతో మెప్పిస్తున్న తారలు..స్థాపించిన ఛారిటీ, ఫౌండేషన్స్ ఇవే!