E-Paper
Advertisement

PlayStation Plus Free: ప్లే స్టేషన్ ప్లస్‌లో సూపర్ గేమ్స్ ఉచితంగా.. మార్చి 2026 ఫ్రీ కేటలాగ్ ఇదే

PlayStation Plus Free: ప్లే స్టేషన్ ప్లస్‌లో సూపర్ గేమ్స్ ఉచితంగా.. మార్చి 2026 ఫ్రీ కేటలాగ్ ఇదే
Advertisement

PlayStation Plus Free Games| గేమర్లకు గుడ్ న్యూస్. సోనీ అధికారికంగా మార్చి 2026 నెల ప్లే స్టేషన్ ప్లస్ గేమ్స్ లిస్ట్ ప్రకటించింది. ఎక్స్‌ట్రా, ప్రీమియం సభ్యులకు ఈ నెలలో కొత్త గేమ్స్ అందుబాటులో ఉంటాయి. మార్చి 17 నుంచి ఈ గేమ్స్ కేటలాగ్‌లో చేరతాయి. సబ్‌స్క్రైబర్లు తమ కన్సోల్‌లో నేరుగా డౌన్‌లోడ్ చేసి ఆడవచ్చు. ఈ నెల లైనప్‌లో పాపులర్ గేమ్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. చాలా గేమ్స్ PS4, PS5 రెండింటిలోనూ పనిచేస్తాయి. ఎక్స్‌ట్రా, ప్రీమియం సభ్యులకు ఈ గేమ్స్ ఉచితం.

Persona 5 Royal హైలైట్ గేమ్

ఈ నెలలో అతి పెద్ద గేమ్ Persona 5 Royal. ఒరిజినల్ Persona 5కి అదనపు మిషన్లు, మ్యూజిక్, సోషల్ గేమ్‌ప్లే యాడ్ చేశారు. కథ మరింత లోతుగా, గేమ్‌ప్లే ఎక్కువ సమయం ఉంటుంది. PS4, PS5 రెండింటిలోనూ ఆడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టమైన రోల్-ప్లేయింగ్ గేమ్‌లలో ఇది ఒకటి.

Blasphemous 2 – ఫుల్ యాక్షన్ గేమ్

Advertisement

ఈ సీక్వెల్ ఇంటెన్స్ యాక్షన్, డార్క్ ఫాంటసీ వరల్డ్‌తో వస్తుంది. ప్లేయర్లు ప్రమాదకర ప్రాంతాలను అన్వేషించి బలమైన శత్రువులతో పోరాడాలి.

యాక్షన్, షూటర్ గేమ్స్

ఈ కేటగిరీలో Warhammer 40,000: Space Marine 2 కూడా ఉన్నాయి. ఈ థర్డ్-పర్సన్ యాక్షన్ షూటర్ గేమ్ PS5 యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ కోసం Madden NFL 26 ఉంది. అప్‌డేటెడ్ టీమ్స్, రియలిస్టిక్ ఫుట్‌బాల్ మెకానిక్స్‌తో ఈ కొత్త గేమ్ మరింత థ్రిల్లింగ్‌గా కానుంది.

స్కై -ఫై, ఫాంటసీ, ఎక్స్‌ప్లోరేషన్ గేమ్స్

Advertisement

ఈ కేటగిరిలో కొత్తగా మెటల్ ఈడెన్ (Metal Eden), ది లార్డ్ ఆఫ్‌ ది రింగ్స్: రిటర్న్ టు మోరియా (The Lord of the Rings: Return to Moria), ఆస్టనీర్ (Astroneer) వచ్చాయి. మెటల్ ఈడెన్.. అనేది ఫ్యూచరిస్టిక్ రోబో షూటర్. హై-టెక్ ఎన్విరాన్‌మెంట్‌లలో శత్రువులతో పోరాడాలి. ది లార్డ్ ఆఫ్‌ ది రింగ్స్: రిటర్న్ టు మోరియా.. సర్వైవల్ గేమ్. మిడిల్-ఎర్త్ యూనివర్స్‌లో రిసోర్సెస్ సేకరించడానికి రహస్యమైన గుహలలో వెళ్లాలి.. టూల్స్ తయారు చేసి సర్వైవ్ చేయాలి. ఆస్టనీర్ అనేది సాండ్‌బాక్స్ ఎక్స్‌ప్లోరేషన్ గేమ్. వివిధ ప్లానెట్లను అన్వేషించి బేస్‌లు బిల్డ్ చేయవచ్చు.

Also Read:  మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇల్లు, ఆఫీస్ రెండింటికీ ఉపయోగకరం

ప్రీమియం సభ్యులకు క్లాసిక్ గేమ్

ప్లే స్టేషన్ ప్లస్ ప్రీమియం సభ్యులకు ఒక క్లాసిక్ గేమ్ కూడా ఉంది. టెక్కెన్: డార్క్ రిసరెక్షన్ (Tekken: Dark Resurrection) వస్తోంది. ఇది ఒరిజినల్‌గా ప్లే స్టేషన్ పోర్టెబుల్ (PlayStation Portable)లో వచ్చిన ఫైటింగ్ గేమ్. ఇప్పుడు ప్రీమియం సభ్యులు మళ్లీ ఆడవచ్చు.

మార్చి 2026 ప్లేస్టేషన్ లైనప్.. యాక్షన్, RPG, స్పోర్ట్స్, సర్వైవల్, ఎక్స్‌ప్లోరేషన్ గేమ్స్‌తో వైవిధ్యమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సోనీ ప్లే స్టేషన్ ప్లస్ కేటలాగ్‌ను నిరంతరం విస్తరిస్తోంది. సబ్‌స్క్రైబర్ల కోసం కొత్త ఆకర్షణీయ గేమ్స్ తీసుకువస్తోంది. గేమర్లు మార్చి 17 నుంచి ఈ గేమ్స్ డౌన్‌లోడ్ చేసి ఆడవచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×