E-Paper
Advertisement

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?
Advertisement

Best kitchen chimneys in India: ప్రస్తుత కాలంలో ఇళ్లు అన్నాక మోడ్రన్ కిచెన్ ఉండటం కామన్ అయిపోయింది. రుచికరమైన వంటకాలు చేసుకునేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిర్లు ఇల్లంతా అలుముకోవడం తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే మార్కెట్‌లోకి అడ్వాన్స్‌డ్ కిచెన్ చిమ్నీలు వచ్చాయి ట్రెండ్‌కు తగ్గట్టుగా,మన వంటకాలకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే టాప్-5 కిచెన్ చిమ్నీలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలోనే దొరికే ఈ మోడల్స్ కిచెన్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. ఇంతకీ ఆ మోడల్స్ ఏంటి? వాటి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ మోడల్స్: 

1.Faber 60 cm Auto-Clean Chimney:

మార్కెట్లో ఫాబర్ బ్రాండ్ చిమ్నీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న, మధ్యతరహా కిచెన్ల కోసం ఇది నంబర్ వన్ ఛాయిస్. దీనిలో సక్షన్ పవర్ 1200 m³/hr  ఉంటుంది కాబట్టి.. ఎక్కువగా వచ్చే పొగను క్షణాల్లో ఇది పీల్చేస్తుంది. థర్మల్ ఆటో-క్లీన్ టెక్నాలజీలో కూడా ఇందులో ఉంది. అంటే.. ఒకే ఒక్క టచ్‌తో లోపలి జిడ్డు వాటంతట అదే క్లీన్ అయిపోతుంది. వేడిని బట్టి ఆటోమేటిగ్గా ఈ మోడల్ పని చేస్తుంది.

Advertisement

ధర: రూ.11,500-రూ.13,500 మధ్య లభిస్తుంది.

2. Elica 60 cm Pyramid Kitchen Chimney:

తక్కువ బడ్జెట్‌లో .. నమ్మకమైన క్వాలిటీ కోరుకునేవారికి ఎల్కా బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. అమెజాన్‌లో.. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది. దీని సక్షన్ పవర్ 1100 m³/hr  కెపాసిటీ కలిగి ఉంది. బాఫిల్ ఫిల్టర్ ఉండటం వల్ల ఇండియన్ వంటల్లోని మసాలాలు, నూనె తుంపరలను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అంతే కాకుండా దీనిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. దీని నాయిస్ కూడా తక్కువగా ఉంటుంది.

Advertisement

ధర: రూ.6,500 – రూ.8,000 మధ్య లభిస్తుంది.

3. Glen 60 cm Curved Glass Chimney:

స్లీక్ డిజైన్, స్టైలిష్ లుక్ కోరుకునే మోడ్రన్ కిచెన్ల కోసం గ్లెన్ చిమ్నీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 1050 m³/hr సక్షన్ పవర్‌తో వస్తుంది. అంతే కాకుండా టచ్ కంట్రోల్స్ విత్ డిజిటల్ డిస్‌ప్లే దీనిలో ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లు కూడా దీనికి ఉండటం వల్ల వంట చేసేటప్పుడు స్టవ్ మీద వెలుతురు స్పష్టంగా కనిపిస్తుంది. దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ.

ధర: రూ.9,000 – రూ.11,000 మధ్య లభిస్తుంది.

4. Inalsa 60 cm Kitchen Chimney:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ట్రెండీ లుక్ కావాలంటే.. ఇనాసా బ్రాండ్ తీసుకోవచ్చు. దీని సక్షన్ పవర్ 1150 m³/hr వరకు ఉంటుంది. అంతే కాకుండా ఇది తక్కువ కరెంట్ ను ఖర్చు చేస్తుంది. ఇదిలా ఉంటే.. దీనిలోని క్యాసెట్ ఫిల్టర్లు గాలిలోని దుమ్మును, నూనె కణాలను ఈజీగా వేరు చేస్తాయి. మోటార్‌కు కంపెనీ ఎక్కువ వారంటీ ఇస్తుంది.

ధర:రూ.5,500-రూ.7,000 మధ్య లభిస్తుంది.

Also Read: బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

5. Kutchina 60 cm Motion Sensor Chimney:

లేటెస్ట్ టెక్నాలజీని.. ఇష్టపడేవారికి కాతా మోషన్ సెన్సార్ చిమ్నీ పర్ఫెక్ట్ ఛాయిస్. అంతే కాకుండా ఇది 1250 m³/hr హై సక్షన్ పవర్ కలిగి ఉంటుంది. చేయి ఊపితే చాలు చిమ్నీ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది (మోషన్ సెన్సార్). ఆటో-క్లీన్ ఫీచర్ కూడా దీనిలో ఉండటం వల్ల ఎక్కడా జిడ్డు పేరుకుపోదు. ఇది మీ కిచెన్‌ను ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుతుంది.

ధర: సుమారు రూ.14,000 – రూ.16,500 మధ్య లభిస్తుంది.

మీ కిచెన్ సైజ్ , మీరు చేసే వంటల విధానాన్ని బట్టి తగిన చిమ్నీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కావాలంటే.. ఎల్కా లేదా ఇనాసా ఎంచుకోవచ్చు. లేదు, హై-ఎండ్ టెక్నాలజీ,ఆటో క్లీన్ కావాలంటే.. ఫాబర్ లేదా కాతా బెస్ట్ ఆప్షన్స్. ఆన్‌లైన్ సేల్స్‌లో వీటిపై భారీ డిస్కౌంట్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈరోజే మీ ఇంటికి ఒక మంచి చిమ్నీని తెచ్చుకోండి!

Related News

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

Big Stories

Advertisement
×