Upasana:సెప్టెంబర్ 4న అనగా నేడు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న వాళ్లను మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు భగవంతుడి ధ్యానంలో లీనం అవుతూ.. దేవాలయాలను సందర్శిస్తూ.. తమ భక్తుని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు తమ పిల్లలకు కృష్ణుడు, గోపికమ్మ వేషాలు వేస్తూ మురిసిపోతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి
ఈ మేరకు ఉపాసన పంచుకున్న ఫోటో, పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగా కోడలిగా, అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిగా, మోస్ట్ టాలెంటెడ్ వుమన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన (Upasana ) ఈ కృష్ణాష్టమి సందర్భంగా తన ఇద్దరు కూతుర్లు, కొడుకు, భర్త రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి ఒక అందమైన ఫోటోని పంచుకుంది. పూజ గదిలో తన భర్త , పిల్లలతో కలిసి దిగిన ఒక ఫోటోని ఆమె షేర్ చేస్తూ..” కల నెరవేరింది. నిజంగా నేను కృతజ్ఞురాలిని. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు” అంటూ పోస్టు పంచుకుంది.
ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలో వైట్ పైజామా లో, పొడవైన జుట్టుతో అటు తిరిగి ఉన్న రామ్ చరణ్ బ్యాక్ సైడ్ లుక్ ఆకట్టుకోగా.. ఎల్లో లావెండర్ కాంబినేషన్లో పట్టుచీర ధరించి ఉపాసన ఆకట్టుకుంది. ఇక ఎల్లో కలర్ దుస్తులలో శ్రీకృష్ణుడిగా వీరి వారసుడు, కూతుర్లతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈవిల్ ఐ ఎమోజీలతో దిష్టి పోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకంటే అందమైన సూపర్ పిక్ ఏదీ లేదు అని, మా చిన్ని కృష్ణుడి ఫేస్ రివీల్ చేయండి అంటూ ఇలా పలు రకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. మొత్తానికైతే ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
also read:అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!
ఇకపోతే రామ్ చరణ్ తన పెద్ది సినిమా షూటింగ్ సమయంలో చేతి మణికట్టుకు గాయమైన విషయం తెలిసిందే. పెద్ది సినిమా విడుదల తర్వాత విశ్రాంతి దొరకడంతో.. కోయంబత్తూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన తన చేతి మణికట్టుకు నిపుణులైన వైద్య బృందం సమక్షంలో సర్జరీ చేయించుకున్నారు.. సర్జరీ తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు ఇలా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆర్సీ 17 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.