Missing features in modern android phones: టెక్నాలజీ మారుతున్నకొద్దీ మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ల రూపం, పరిమాణం, వాటి పనితీరు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ప్రతి మొబైల్‌లో సర్వసాధారణంగా.. కనిపించిన కొన్ని అద్భుతమైన ఫీచర్లు నేడు పూర్తిగా మాయమయ్యాయి. కొత్త మోడల్స్ పేరిట కంపెనీలు కొన్ని హార్డ్‌వేర్ ఆప్షన్లను తొలగించడంతో యూజర్లు వాటిని ఎంతగానో మిస్ అవుతున్నారు. ఇంతకీ కాలక్రమేణా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి కనుమరుగైన ఆ 6 ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ల పరిణామ క్రమంలో.. మనం కోల్పోయిన ఆసక్తికరమైన అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. లేటెస్ట్ ఫోన్లు స్లిమ్‌గా, పవర్ ఫుల్‌గా మారుతున్నప్పటికీ, పాత రోజుల్లో యూజర్లకు ఎంతో సౌకర్యంగా ఉన్న కొన్ని ఫీచర్లు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అవేంటంటే..
ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ల బ్యాటరీ.. పాడైపోయినా లేదా ఫోన్ హ్యాంగ్ అయినా, వెనక కవర్ తీసి బ్యాటరీని ఈజీగా మార్చుకునే.. వాళ్ళం. కానీ నేడు వచ్చే స్మార్ట్ ఫోన్లన్నీ యూనిబాడీ డిజైన్‌తో వస్తున్నాయి. దీని వల్ల బ్యాటరీ పాడైతే కస్టమర్ కేర్‌కు వెళ్లాల్సిందే తప్ప మనంతట మనం మార్చుకునే వీలు లేదు. వాటర్ రెసిస్టెన్స్ , సన్నని డిజైన్ కోసం కంపెనీలు ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించాయి. మార్కెట్లో ఇప్పుడు కొత్త బ్యాటరీ మార్చడానికి సుమారు రూ.1,000 నుంచి రూ.2,500 వరకు ఖర్చు అవుతోంది.
మొబైల్స్ నుంచి ఆడియో జాక్ తొలగించడం అనేది మరో అంశం. ఒకప్పుడు వైర్డు ఇయర్‌ఫోన్స్‌ను నేరుగా ఫోన్‌కు ప్లగ్ చేసుకుని పాటలు వినేవాళ్ళం. ప్రస్తుతం రూ.10,000 బడ్జెట్ ఫోన్ల నుంచి లక్షల విలువైన ప్రీమియం ఫోన్ల వరకు హెడ్‌ఫోన్.. జాక్ కనుమరుగైంది. దీనికి బదులుగా వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతుండగా.. వాటి ధరలు మోడల్ బట్టి మారుతున్నాయి.
ఫోన్ మెమరీ ఫుల్ అయితే చాలు.. ఒక చిన్న మెమరీ కార్డ్ వేసి వేల ఫోటోలు, పాటలను దాచుకునే.. రోజులు పోయాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్‌ను తీసేస్తున్నాయి. ఎక్కువ స్పేస్ కావాలంటే.. ఎక్కువ ధర పెట్టి హై-వేరియంట్ ఫోన్‌లను కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెమరీ కార్డ్ సపోర్ట్ ఉన్న ఫోన్లతో పోలిస్తే.. హై-స్టోరేజ్ ఫోన్ల ధర రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఎక్కువగా ఉంటోంది.
పాత ఆండ్రాయిడ్ ఫోన్ల ముందు భాగంలో.. వేగంగా పని చేసే ఫిజికల్ బటన్లు ఉండేవి. అలాగే.. ఫోన్‌కు ఎవరైనా మెసేజ్ చేస్తే బ్లింక్ అయ్యే చిన్న ఎల్ఈడీ లైట్ నోటిఫికేషన్లు అందరికీ గుర్తుండే ఉంటాయి.ఇప్పుడు ఆల్‌వేస్-ఆన్ డిస్‌ప్లే టెక్నాలజీ వచ్చాక ఆ చిన్న ఎల్ఈడీ లైట్లు పూర్తిగా కనుమరుగయ్యాయి.
ఒకప్పుడు షియోమి, రెడ్‌మి వంటి ఫోన్లలో.. టీవీలు, ఏసీలను కంట్రోల్ చేయడానికి ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చేవారు. దీని వల్ల ఫోనే రిమోట్‌లా పని చేసేది. కానీ.. స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్లు, వైఫై ఆటోమేషన్ పెరగడంతో.. కంపెనీలు ఈ హార్డ్ వేర్‌ను ఫోన్ల నుంచి తొలగించాయి. మార్కెట్లో ప్రత్యేక యూనివర్సల్ రిమోట్లు కొనాలంటే.. రూ.500 నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
Also Read: సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!
ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా ఇయర్ ఫోన్స్ పెట్టి ఎఫ్‌ఎం రేడియోలో.. పాటలు వినే ఫీల్ వేరు. కానీ ఆన్‌లైన్ మ్యూజిక్ యాప్స్ రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో.. ఎఫ్‌ఎం రేడియో యాప్స్, సపోర్ట్ చాలా వరకు స్మార్ట్ ఫోన్లలో.. కనిపించడం లేదు.
కాలం మారుతున్నకొద్దీ టెక్నాలజీ మారుతోంది. కొన్ని ఫీచర్లు కనుమరుగైనప్పటికీ.. వాటి స్థానంలో మరింత ఫాస్ట్ ప్రాసెసర్లు, అద్భుతమైన కెమెరాలు, మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ పాత కాలపు ఆండ్రాయిడ్ ఫీచర్లను చాలా మంది యూజర్లు ఇప్పటికీ మిస్ అవుతుంటారు.