E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!
Advertisement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా రాకపోకలు చేసే రైళ్ల వేళల్లో మార్పులు చేసిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) ప్రకటించింది. రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శ్రీధర్ మాట్లాడుతూ.. SCR పరిధిలో ప్రయాణించే ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్‌ సవరించినట్లు వెల్లడించారు. నవంబరు 4వ తేదీ నుంచి వివిధ తేదీల్లో ఈ సవరించిన వేళలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం, నిర్వహణ పరమైన కారణాల వల్ల ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.

నవంబర్ 4వ తేదీ లేదా ఆ తర్వాత ప్రయాణాలను ప్లాన్ చేసుకొనేవారు రైలు బయలుదేరే వేళలు, స్టేషన్లకు చేరుకునే సమయాలను ముందుగానే తెలుసుకోవాలని శ్రీధర్ సూచించారు. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం రైల్వే అధికారిక ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోవాలని తెలిపారు.

సవరించిన రైళ్ల సమయాల వివరాలు ఇలా ఉన్నాయి

Advertisement

⦿ తిరువనంతపురం – చర్లపల్లి (17042) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు సాయంత్రం 5:00 గంటలకు గుంటూరులో బయల్దేరి సాయంత్రం 5:45 గంటలకు సత్తెనపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది.

⦿ మైసూర్ – కాకినాడ టౌన్ (17290) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 07, 2026 నుంచి గుంటూరు స్టేషన్‌‌కు మధ్యాహ్నం 3:00 గంటలకు చేరుకుని, 3:05 గంటలకు బయలుదేరుతుంది. (ఈ రైలు పాత సమయం: మధ్యాహ్నం 3.51 గంటలకు చేరుకుని, 3.56 గంటలకు బయలుదేరేది.)

Advertisement

⦿ మైసూర్ – కాకినాడ టౌన్ (17290) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 07, 2026 నుంచి గుంటూరు స్టేషన్‌కు మధ్యాహ్నం 3:00 గంటలకు చేరుకుని, 3:05 గంటలకు బయలుదేరుతుంది. (ఈ రైలు పాత సమయం: మధ్యాహ్నం 3.51 గంటలకు చేరుకుని, 3.56 గంటలకు బయలుదేరేది.)

⦿ హిసార్ – కాకినాడ టౌన్ (17296) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 06, 2026 నుంచి గుంటూరు స్టేషన్‌కు మధ్యాహ్నం 3:40 గంటలకు చేరుకుని, 3:45 గంటలకు బయలుదేరుతుంది. (ఈ రైలు పాత సమయం: సాయంత్రం 4.11 గంటలకు చేరుకుని, 4.16 గంటలకు బయలుదేరేది.)

⦿ చర్లపల్లి – తిరుపతి (17444) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు వేళలు నవంబర్ 06, 2026 నుంచి మారనున్నాయి.
నడికుడి: రాత్రి 7:19 గంటలకు చేరుకుని, 7:20 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: రాత్రి 7.30 / 7.32).
పిడుగురాళ్లు: రాత్రి 7:38 గంటలకు చేరుకుని, 7:40 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: రాత్రి 8.05 / 8.07).
మార్కాపూర్ రోడ్: రాత్రి 9:05 గంటలకు చేరుకుని, 9:07 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: రాత్రి 9.20 / 9.22).
గిద్దలూరు: రాత్రి 10:05 గంటలకు చేరుకుని, 10:07 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: రాత్రి 10.38 / 11.40).
దిగువమెట్ట: రాత్రి 10:20 గంటలకు చేరుకుని, 10:30 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: రాత్రి 10.57 / 11.07).
నంద్యాల: రాత్రి 11:40 గంటలకు చేరుకుని, 11:45 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: అర్ధరాత్రి 12.20 / 12.25).

⦿ గుంటూరు – కాచీగూడ (17251) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 04, 2026 నుంచి గుంటూరు స్టేషన్ నుంచి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరుతుంది. (ఈ రైలు పాత సమయం: సాయంత్రం 6.40 గంటలు.)

⦿ తిరువనంతపురం నార్త్ – సికింద్రాబాద్ (20630) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 04, 2026 నుంచి సత్తెనపల్లి స్టేషన్‌కు ఉదయం 6:44 గంటలకు చేరుకుని, 6:45 గంటలకు బయలుదేరుతుంది. (ఈ రైలు పాత సమయం: ఉదయం 6.54 గంటలకు చేరుకుని, 6.55 గంటలకు బయలుదేరేది.)

⦿ కాచీగూడ – రేపల్లె (17625) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 04, 2026 నుంచి పిడుగురాళ్ల స్టేషన్‌కు రాత్రి (అర్ధరాత్రి దాటాక) 2:41 గంటలకు చేరుకుని, 2:42 గంటలకు బయలుదేరుతుంది. (ఈ రైలు పాత సమయం: రాత్రి 2.51 గంటలకు చేరుకుని, 2.52 గంటలకు బయలుదేరేది.)

⦿ తిరుచిరాపల్లి – చర్లపల్లి (17078) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 04, 2026 నుంచి నూతన వేళలతో నడుస్తుంది.
గుంటూరు: మధ్యాహ్నం 2:40 గంటలకు చేరుకుని, 2:50 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: మధ్యాహ్నం 3.05 / 3.15).
సత్తెనపల్లి: మధ్యాహ్నం 3:19 గంటలకు చేరుకుని, 3:20 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: మధ్యాహ్నం 3.33 / 3.35).
నడికుడి: మధ్యాహ్నం 3:59 గంటలకు చేరుకుని, సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: సాయంత్రం 4.23 / 4.25).

⦿ తిరువనంతపురం నార్త్ – చర్లపల్లి (17042) ఎక్స్‌ప్రెస్: ఈ రైలు నవంబర్ 04, 2026 నుంచి నూతన వేళలతో నడుస్తుంది.
గుంటూరు: సాయంత్రం 5.00 గంటలకు చేరుకుని, 5.10 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: సాయంత్రం 5.40 / 5.50).
సత్తెనపల్లి: సాయంత్రం 5.45 గంటలకు చేరుకుని, 5.46 గంటలకు బయలుదేరుతుంది (పాత సమయం: సాయంత్రం 6.59 / 7.00).

Also Read: వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

Big Stories

Advertisement
×