E-Paper
Advertisement

నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్

నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్
Advertisement

నగరంలోని అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరుగా నిలిచే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఘోరకలి చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దీనిని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళా సహాయకురాలే ఈ ఘాతుకానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

క్రూరంగా చంపేశారు: సీపీ సజ్జనార్

Advertisement

బాధితురాలిని నిందితులు అత్యంత అమానుషంగా హతమార్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. హత్య సమయంలో ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి గట్టిగా నొక్కేశారు. చేతులు కాళ్లు కట్టేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారని ఆయన పేర్కొన్నారు. కేవలం దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంట్లో యజమానులు ఎవరూ లేని సమయాన్ని ముందే ప్లాన్ చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు.

నేపాలీ గ్యాంగ్ హస్తం

Advertisement

ఈ దారుణం వెనుక నేపాలీ ముఠా హస్తం ఉందని సీపీ స్పష్టం చేశారు. సుమారు ఏడాది క్రితం ఈ ఇంట్లో పనికి చేరిన నేపాలీ మహిళ యజమానుల కదలికలపై నిశితంగా నిఘా ఉంచింది. బయట నుంచి వచ్చిన తన గ్యాంగ్ సభ్యుల సహకారంతో ఆమె ఈ హత్యకు పాల్పడింది. దొంగతనం చేసిన అనంతరం నిందితులందరూ అక్కడి నుంచి పరారయ్యారు. నేపాలీ గ్యాంగ్‌లు నమ్మకంగా ఇంట్లో చేరుతూ అదును చూసి యజమానుల ప్రాణాలు తీయడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నేపాలీ పనిమనుషుల విషయంలో ప్రజలు చాలా కాలంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత రెండు నెలల నుంచి పోలీసులు ఈ విషయమై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేపాలీ గ్యాంగ్‌లు తరచుగా ఇళ్లలో పనికి చేరి యజమానుల నమ్మకాన్ని గెలుచుకుంటాయి. సమయం దొరికినప్పుడు దొంగతనాలు చేస్తూ హత్యలకు వెనుకాడరని ఆయన హెచ్చరించారు.

పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి 

ఇళ్లలో పనిమనుషులను పెట్టుకునే వారు కచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సీపీ సూచించారు. వారి ఆధార్ కార్డులు, ఫోటోలు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని కోరారు. పనిమనుషులు ఎవరితో మాట్లాడుతున్నారు? వారు ఎక్కడికి వెళ్తున్నారు? అనే విషయాలపై యజమానులు నిరంతరం కన్నేసి ఉంచాలి. అపరిచిత వ్యక్తులను నేరుగా పనిలో పెట్టుకోవడం ప్రాణాల మీదకు తెస్తుందని ఆయన హెచ్చరించారు. ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి ఇంట్లోనే ఇలాంటి ఘటన జరగడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

ALSO READ: దేశానికే కొడంగల్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×