E-Paper
Advertisement

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!
Advertisement

Portable AC: భగభగమండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో ఏసీలను ఉపయోగిస్తున్నారు. అయితే అద్దె ఇళ్లలో ఉండేవారికి లేదా గోడలు పాడుచేయడం ఇష్టం లేనివారికి ‘పోర్టబుల్ ఏసీలు’ (Portable ACs) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పోర్టబుల్ ఏసీ కొనాలని భావిస్తున్నవారికి ఈ ఏడాది మార్కెట్లో విపరీత ఆదరణ పొందుతున్న పోర్టబుల్ ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేసి.. మీ అంచనాలకు అనుగుణంగా ఉన్న దానిని ట్రై చేయండి.

మిడియా డ్యూయో (Midea Duo MAP14S1TBL)

ప్రస్తుతం పోర్టబుల్ ఏసీల విభాగంలో ‘మిడియా డ్యూయో’ టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ఇది ‘హోస్-ఇన్-హోస్’ (డ్యూయల్ హోస్) టెక్నాలజీతో రూపొందింది. దీనివల్ల గదిలోని వేడి గాలి బయటకు వెళ్తూ చల్లటి గాలి చాలా వేగంగా గది మెుత్తాన్ని నింపేస్తుంది. పెద్ద గదులను సైతం కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇది ఐస్ ముక్కలా మార్చేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా తక్కువ శబ్దంతో పనిచేయడం దీని ప్రత్యేకతగా చెబుతోంది.

వైంటర్ పోర్టబుల్ ఏసీ (Whynter ARC-1230WN)

Advertisement

గది కాస్త పెద్దగా ఉంటే ‘వైంటర్’ బ్రాండ్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది 12,000 BTU సామర్థ్యంతో వస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఇది దాదాపు 40% నుండి 50% వరకు విద్యుత్‌ను ఆదా చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా ద్వారా వాయిస్ కంట్రోల్ చేసుకునే స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బరువు కొంచెం ఎక్కువే అయినా.. కింద ఉన్న వీల్స్ సహాయంతో సులభంగా ఒక చోటు నుంచి మరో చోటుకు దీన్ని తరలించొచ్చు.

ఎల్‌జీ డ్యూయల్ ఇన్వర్టర్ (LG LP1419IVSM)

ఏసీ చేసే శబ్దానికి చిరాకు పడేవారి కోసం ఎల్‌జీ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆటో ఎవాపరేషన్ సిస్టమ్ వల్ల నీటిని మాటిమాటికీ తీసివేయాల్సిన అవసరం ఉండదు, నిర్వహణ చాలా సులభం. ఎల్‌జీ ‘ThinQ’ యాప్ ద్వారా దీన్ని ఫోన్ నుంచే ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

Also Read: Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

సెరెన్‌లైఫ్ (SereneLife SLPAC10)

తక్కువ బడ్జెట్‌లో, తేలికపాటి పోర్టబుల్ ఏసీ కావాలనుకునే వారికి ‘సెరెన్‌లైఫ్’ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీని బరువు చాలా తక్కువగా ఉండటంతో పాటు ఇన్‌స్టాలేషన్ కూడా కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. చిన్న, మీడియం సైజ్ గదులకు ఈ కదిలే ఏసీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బడ్జెట్ ధరలో మంచి కూలింగ్ ఇచ్చే ఏసీ కోసం చూసేవారికి ఇది బెస్ట్ వాల్యూ మనీ అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×