E-Paper
Advertisement

Portable Projectors: టీవీ అవసరం లేదు.. ఈ మినీ ప్రొజెక్టర్‌తో ఇంటి గోడనే సినిమా థియేటర్ చేసేయండి!

Portable Projectors: టీవీ అవసరం లేదు.. ఈ మినీ ప్రొజెక్టర్‌తో ఇంటి గోడనే సినిమా థియేటర్ చేసేయండి!
Advertisement

Portable Projectors: సాధారణంగా సినిమా అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పెద్ద స్క్రీన్. అయితే, మధ్యతరగతి కుటుంబాలకు లక్షల రూపాయలు పెట్టి పెద్ద టీవీ కొనడం సాధ్యం కాదు. ఒకవేళ కొన్నా.. వాటిని ఒక గది నుండి ఇంకో గదికి మార్చడం పెద్ద తలనొప్పి. అలాంటి వారికి బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కావాలకుంటే ఈ ‘పోర్టబుల్ ప్రొజెక్టర్‌లు’ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ఇవి అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటాయి. కానీ ఇంటి గోడనే పెద్ద సినిమా స్క్రీన్‌లా మార్చేస్తాయి. మరి మార్కెట్లో ఉన్న బెస్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్‌లు ఏవో ఇప్పుడు చూద్దామా..

Wzatco Yuva Infinity

క్లారిటీ విషయంలో ఈ ప్రొజెక్టర్ అదిరిపోతుందనే చెప్పాలి. ఇది 1080P రిజల్యూషన్‌తో పాటు 4K కంటెంట్‌ను కూడా చాలా నీట్‌గా చూపిస్తుంది. దీనిలో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ ఫీచర్లు ఉండటం వల్ల మనం ప్రతిసారీ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అదే స్క్రీన్‌ను సెట్ చేసేసుకుంటుంది. గూగుల్ టీవీ కూడా ఉండటం వల్ల డైరెక్ట్‌గా మనకు నచ్చిన యాప్స్ చూసేయొచ్చు.

XGIMI MoGo 4

Advertisement

మంచి లుక్, గట్టి బిల్డ్ క్వాలిటీ కావాలంటే ఎక్స్ జిమి మోగో 4 బెస్ట్ ఛాయిస్. దీనికి 360 డిగ్రీల అడ్జస్టబుల్ స్టాండ్ ఉంటుంది. దీంతో ఏ యాంగిల్‌లోనైనా సినిమా ప్లే చేసుకోవచ్చు. అలాగే దీనిలో ఇన్‌బిల్ట్ బ్యాటరీ ఉండటంతో.. అది రెండున్నర గంటల పాటు వస్తుంది. అంటే.. కరెంట్ లేకపోయినా లేదా బయట టూర్లకు వెళ్లినప్పుడు కూడా హ్యాపీగా ఒక సినిమా మొత్తం చూసేయొచ్చు.

Also Read: ఇండెక్షన్ స్టవ్ కొంటున్నారా? గ్యాస్‌తో పోల్చితే.. దేనికి ఎక్కువ ఖర్చవుతుంది?

Lumio Arc 5

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ప్రొజెక్టర్ కోసం వెతుకుతుంటే మాత్రం.. ఈ లూమియో ఆర్క్ 5ను కొనుగోలు చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 గూగుల్ టీవీతో వస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ లాంటి యాప్స్ ముందే ఇందులో ఉంటాయి. ఈ ప్రొజెక్టర్‌లో ఆర్క్‌లైట్ ఆప్టికల్ ఇంజిన్ ఉండటం వలన దుమ్ము వెళ్లకుండా ఆపుతుంది. దీంతో ప్రొజెక్టర్ త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతుంది.

Portronics Beem 560

స్టైలిష్ డిజైన్, పీక్ బ్రైట్‌నెస్ కావాలనుకునే వారికి పోర్ట్రానిక్స్ బీమ్ 560 పర్ఫెక్ట్. ఫోన్‌లోని వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూడటానికి దీనిలో వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ ఉంది. దీనికి ఉన్న టిల్ట్ డిజైన్ వల్ల యాంగిల్‌ను చాలా ఈజీగా మార్చుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే మంచి మోడల్ ఇది.

BenQ GV32

సినిమా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదనుకుంటే బెన్ క్యూ జీవీ 32 ని ఎంచుకోవచ్చు. ఇది 135 డిగ్రీల వరకు రొటేట్ అవుతుంది. దీంతో పడుకుని సీలింగ్ మీద కూడా సినిమా చూడొచ్చన్నమాట. అలాగే ఈ ప్రొజెక్టర్‌లో ఉన్న సెన్సార్లు స్క్రీన్‌ను చాలా అద్భుతంగా అడ్జస్ట్ చేస్తాయి. సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్లారిటీ విషయంలో ఇది మెరుగైన పనితీరుని అందిస్తుంది.

Also Read: జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న BSNL.. రూ.997 ప్లాన్‌పై బంపర్ ఆఫర్!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×