E-Paper
Advertisement

Induction vs Gas Stove: ఇండెక్షన్ స్టవ్ కొంటున్నారా? గ్యాస్‌తో పోల్చితే.. దేనికి ఎక్కువ ఖర్చవుతుంది?

Induction vs Gas Stove: ఇండెక్షన్ స్టవ్ కొంటున్నారా? గ్యాస్‌తో పోల్చితే.. దేనికి ఎక్కువ ఖర్చవుతుంది?
Advertisement

Induction vs Gas Stove: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని ఫలితంగా భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు మండుతున్న ఎండల వల్ల సమ్మర్‌లో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగి కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతాయని సామాన్యులు భయపడుతున్నారు. ఇలాంటి టెన్షన్ల మధ్య.. ప్రతిరోజూ వంటకి గ్యాస్ వాడాలా? లేక ఇండక్షన్ స్టవ్‌ మంచిదా? అని చాలామందికి పెద్ద డౌట్ వస్తోంది. మరి వేసవిలో కూడా కరెంట్ బిల్లు భారం పడకుండా, గ్యాస్ ఖర్చును తగ్గిస్తూ స్మార్ట్‌గా ఎలా వంట చేయాలో ఇప్పుడు చూద్దామా..

రెండింటిలో ఏది బెస్ట్?

సాధారణ గ్యాస్ స్టవ్ వాడితే ఆ మంట పాత్ర మొత్తాన్ని వేడి చేస్తుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఇండక్షన్ అలా కాదు.. ఇది విద్యుదయస్కాంత శక్తితో నేరుగా పాత్ర అడుగు భాగాన్నే వేడి చేస్తుంది. అందుకే ఇండక్షన్ మీద వంట చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. పాలు కాచుకోవాలన్నా, నీళ్లు వేడి చేయాలన్నా గ్యాస్ కంటే ఇండక్షనే చాలా స్పీడ్.

Advertisement

Also Read: ఈ వేసవిలో ఏ ఫ్యాన్ వాడటం హెల్త్‌కి మంచిది? నిపుణులు ఇస్తున్న సూచనలివే!

ఇండక్షన్‌తో కలిగే లాభాలు:

చాలామందికి ఉన్న పెద్ద భయం ఏంటంటే.. ఇండక్షన్ వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందని. కానీ నిజం చెప్పాలంటే, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ రేట్ల కంటే కరెంటే మనకు చౌకగా పడుతోంది. పైగా తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద కొంత వరకు ఫ్రీ కరెంట్ వస్తోంది కాబట్టి, ఇండక్షన్ వాడితే నెలకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఈజీగా మిగుల్చుకోవచ్చు. ఇక గ్యాస్ బుక్ చేయడం, అది వచ్చే వరకు ఎదురుచూడటం వంటి తిప్పలు కూడా ఇండక్షన్‌తో ఉండవు.

క్లీనింగ్ తలనొప్పులు ఉండవు:

Advertisement

వంటగదిలో సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. గ్యాస్ లీక్ అవుతుందన్న భయం లేదా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మంట వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇండక్షన్ మీద మంట ఉండదు కాబట్టి.. ఇలాంటి ప్రమాదాలు తక్కువ. అలాగే వంట అయిపోయాక క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఒక తడి గుడ్డతో తుడిస్తే చాలు.. కొత్తదానిలా మెరిసిపోతుంది. గ్యాస్ స్టవ్ బర్నర్లు, ఇనుప స్టాండ్లను తోమి శుభ్రం చేయాలంటే అది పెద్ద సర్కస్సే మరి.

సమయం, డబ్బు ఆదా:

వంట పనిని చకచకా ముగించేయాలనుకుంటే మాత్రం ఇండక్షన్ స్టవ్ బెస్ట్ ఆప్షన్. కాకపోతే, ఇండక్షన్ వాడాలంటే దానికి సరిపోయే ప్రత్యేక పాత్రలే ఉండాలి. పాత అల్యూమినియం గిన్నెలు దీనిపై పని చేయవు. ఒకవేళ మీ ఏరియాలో పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నా, లేదా మంట మీద పుల్కాలు, రొట్టెలు కాల్చడం అలవాటున్నా గ్యాస్ స్టవ్ పక్కన ఉండాల్సిందే. అందుకే ఇవాల్టి రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫ్యామిలీలు రెండింటినీ వాడుతూ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుంటున్నారు.

Also Read: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో Poco కొత్త ఫోన్లు.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×