E-Paper
Advertisement

BSNL Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న BSNL.. రూ.997 ప్లాన్‌పై బంపర్ ఆఫర్!

BSNL Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలు చూపిస్తున్న BSNL.. రూ.997 ప్లాన్‌పై బంపర్ ఆఫర్!
Advertisement

BSNL Prepaid Plans: కొంతకాలంగా ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచుతున్న తరుణంలో.. ప్రభుత్వ రంగ సంస్థ BSNL తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. యూజర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ ఇప్పుడొక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనివల్ల మార్కెట్లోని అగ్రగామి కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

14 రోజుల అదనపు వ్యాలిడిటీ..

BSNL తన పాపులర్ రూ.997 ప్లాన్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ప్రకారం.. మార్చి 31వ తేదీలోపు రీఛార్జ్ చేసుకునే వారికి అదనంగా 14 రోజుల వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తుంది. దీంతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే మొత్తం 164 రోజుల పాటు ఈ సేవలను వాడుకోవచ్చు. దాదాపు ఐదున్నర నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వాళ్లు ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఈ వేసవిలో ఏ ఫ్యాన్ వాడటం హెల్త్‌కి మంచిది? నిపుణులు ఇస్తున్న సూచనలివే!

అన్‌లిమిడెట్ డేటా & కాలింగ్..

ఈ ప్లాన్ కేవలం వ్యాలిడిటీకే పరిమితం కాలేదు. దీనిలో ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. పెరిగిన వ్యాలిడిటీతో కలిపి చూస్తే వినియోగదారులు మొత్తం 328GB డేటాను పొందుతారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. రోజుకు 100 SMSలతో పాటు వినోదం కోసం B-TV Subscription కూడా ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా లైవ్ టీవీ ఛానెళ్లను నేరుగా మొబైల్‌లోనే వీక్షించవచ్చు.

అతి తక్కువ ధరలో డేటా ప్యాక్..

Advertisement

బిఎస్‌ఎన్‌ఎల్ భారీ ప్లాన్‌లతో పాటు చిన్న అవసరాల కోసం కూడా కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. ఇటీవల కేవలం రూ.16కే 4GB డేటా ఇచ్చే కొత్త ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్, అత్యవసరంగా డేటా కావాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు, వీడియో స్ట్రీమింగ్ చేసే సమయంలో డేటా అయిపోతే, ఇది చాలా తక్కువ ధరలో లభించే బెస్ట్ ఆప్షన్. నాణ్యమైన సేవలను తక్కువ ధరలో అందించడం ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ ఫామ్‌లోకి వస్తోంది.

Also Read: టర్బో స్టవ్.. దీనికి గ్యాస్ అవసరం లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×