E-Paper
Advertisement

సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు
Advertisement

Best portable projector under 5000: ప్రస్తుత కాలంలో ఎంటర్‌ టైన్‌మెంట్ అంటే.. కేవలం టీవీలకే పరిమితం కాలేదు. బెడ్‌రూమ్ గోడలపై లేదా హాల్‌లో పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంజాయ్.. చేయడానికి మినీ ప్రాజెక్టర్ల ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం అనేక రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ. 5,000 లోపు లభిస్తున్న బెస్ట్ 5 పోర్టబుల్ ప్రాజెక్టర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.Zebronics Zeb PixaPlay 72 Plus:

Advertisement

మార్కెట్లో ఫఏమస్ బ్రాండ్‌గా పేరున్న జెబ్రోనిక్స్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ ప్రాజెక్టర్ ధర సరిగ్గా రూ.4,999 వరకు ఉంది. ఇది వైర్‌లెస్ సపోర్ట్, హెచ్‌డీ రెసొల్యూషన్ ,ఈజీగా కనెక్ట్ అయ్యే ఫీచర్లతో వస్తుంది. దీనిని మీ స్మార్ట్‌ ఫోన్‌కు వైర్‌లెస్ ద్వారా కనెక్ట్ చేసుకొని పెద్ద స్క్రీన్‌పై వీడియోలు చూడొచ్చు. చిన్న రూమ్‌లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2.Magcubic HY300 Pro Smart Projector:

ట్రెండింగ్ మినీ ప్రాజెక్టర్లలో.. మాబ్‌క్యూబిక్ HY300 ప్రో ముందు వరుసలో ఉంటుంది. దీని ధర సుమారు రూ.3,800 నుంచి రూ.4,100 మధ్య లభిస్తోంది. ఇది 180 డిగ్రీల రొటేటబుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంటే మీరు దీన్ని గోడలపైనే కాకుండా నేరుగా బెడ్‌రూమ్ సీలింగ్ పై కూడా ప్రొజెక్ట్ చేసుకొని పడుకొని సినిమాలు చూడొచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్, ఆటో కీస్టోన్ కరెక్షన్ దీని ప్రత్యేకత.

3.Livato HY300 Pro HD Projector:

Advertisement

బడ్జెట్ ధరలో మెరుగైన.. బ్రైట్‌ నెస్ కోరుకునే.. వారికి లివాటో HY300 ప్రో చక్కటి ఆప్షన్. దీని ధర మార్కెట్లో సుమారు రూ.4,095గా ఉంది. ఇది ఎల్ఈడీ ల్యాంప్ టెక్నాలజీతో.. వస్తుంది. అంతే కాకుండా వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ సైజ్‌లో ఉండే ఈ ప్రాజెక్టర్‌ను ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా బ్యాగ్‌లో చాలా ఈజీగా సర్దుకోవచ్చు.

4. Egate Atom 2X HD Smart Projector:

ప్రముఖ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్ అయిన.. ఈగేట్ నుంచి వచ్చిన ఈ ప్రాజెక్టర్ ధర రూ. 4,999 బడ్జెట్‌లో లభిస్తుంది. ఇది లాంగ్ లాస్టింగ్ ఎల్ఈడీ ల్యాంప్ లైఫ్ , మెరుగైన కాంట్రాస్ట్ రేషియోను కలిగి ఉంటుంది. ఇంటి అవసరాల కోసం, పిల్లల ఆన్‌లైన్ క్లాసులు లేదా ప్రాజెక్ట్ల కోసం ఇది చాలా బాగుంటుంది.

5. Lapcare Laplay LLP-012 HD Smart Projector:

నమ్మకమైన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లాప్‌కే నుంచి వచ్చిన ఈ పోర్టబుల్ ప్రాజెక్టర్ ధర సుమారు రూ.4,749 వరకు ఉంది. ఇది హెచ్డీ రిజల్యూషన్ సపోర్ట్, వైర్‌లెస్ కనెక్టివిటీ, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.తక్కువ ధరలో ఎక్కువ కాలం మన్నేలా దీనిని డిజైన్ చేశారు.

Also Read: ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్-ధర ఎంతంటే? 

బడ్జెట్ ప్రాజెక్టర్ కొనేటప్పుడు గమనించాల్సినవి:

ఈ ధరలలో లభించే ప్రాజెక్టర్లు సాధారణంగా డార్క్ రూమ్స్ (చీకటి గదులు)లో బెస్ట్ ఫలితాలు ఇస్తాయి.

వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్ ,బ్లూటూత్ స్పీకర్ కనెక్టివిటీ ఆప్షన్లు వీటిలో ప్రాథమికంగా లభిస్తాయి.

రూ.5,000 లోపు బడ్జెట్‌లో మీ ఇంట్లోనే మినీ థియేటర్ ఫీల్ పొందాలనుకుంటే.. పైన పేర్కొన్న పోర్టబుల్ ప్రాజెక్టర్లు బెస్ట్ ఆప్షన్లు. మీ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకొని వీకెండ్స్‌ను మరింత ఆనందంగా గడపండి!

Related News

ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

రూ.736కే ట్రెండీ ఇయర్‌బడ్స్..ఫీచర్లు చూస్తే ఫిదా అవడం గ్యారంటీ

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

అమెజాన్ సేల్..రూ.50వేలలోపు టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

టెక్ వరల్డ్‌లో సెన్సేషన్..‘కింగ్ద్రా’ కోడ్‌తో నథింగ్ ఇయర్ 3 ప్రో గ్రాండ్ ఎంట్రీ

Big Stories

Advertisement
×