E-Paper
Advertisement

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

రైతులకు మద్దతు ధర, దళారుల బారిన పడొద్దు

Advertisement

హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈ రోజు నుంచే 136 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సీజన్‌లో వరి సాగు తగ్గడంతో ధాన్యానికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. రైతుల కళ్లాల వద్దకే దళారులు వస్తున్నారని, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే దళారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే నిర్మోహమాటంగా అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు.

గౌరవెల్లి భూ బాధితుల త్యాగాలు మరవలేనివి

Advertisement

2007లోనే శ్రీకారం చుట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు భూములు త్యాగం చేయడం వల్లే నేడు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని, భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరి త్యాగాన్ని ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందని హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్లు వారికే..

నియోజకవర్గంలో గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలకు, రహదారుల వెడల్పులో ఇళ్లు కోల్పోయిన అర్హులందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోని 300కు పైగా మండలాలు కరువు బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన సహాయం కోసం ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, అనంతరం అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Also Read: ‘వాళ్ళు గడ్డి తిన్నారని.. మీరూ అదే తింటారా’? కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్!

Tags

Related News

‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!

కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

బొగ్గు కాదు.. ఇక సింగరేణిలో బంగారం, లిథియం తవ్వకాలు: భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్!

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. కండక్టర్‌తో గొడవ… కాళ్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Big Stories

Advertisement
×