Best vacuum cleaner for home: పండగలు వచ్చినా, సండే క్లీనింగ్ డే వచ్చినా ఇల్లు మొత్తం దుమ్ము దులపాలంటేనే ఒళ్లు నొప్పులు వచ్చేస్తాయి. చీపురుతో ఊడ్చితే సన్నటి మైక్రో డస్ట్ గాల్లోకి లేచి అలర్జీలు వస్తుంటాయి. ఇలాంటి టైమ్‌లో స్మార్ట్‌గా, తక్కువ శ్రమతో ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్స్ బెస్ట్ ఆప్షన్. ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో అగారో (Agaro) బ్రాండ్ తన పవర్‌ఫుల్ మోటార్స్, హెపా ఫిల్టర్లతో కస్టమర్ల మనసులు గెలుచుకుంటోంది. ఈ రోజు మనం బెస్ట్ రేటింగ్ సాధించిన టాప్ అగారో వాక్యూమ్ క్లీనర్స్ ఏంటో, వాటి స్పెషాలిటీస్ ఏంటో డీటెయిల్డ్‌గా చూద్దాం.
అగారో బ్రాండ్ మన అవసరాలకు తగ్గట్టుగా రకరకాల మోడల్స్‌ను అందిస్తోంది. వాటిలో బెస్ట్ సెల్లర్స్ ఇవే..
1. అగారో రీగల్ 800 వాట్స్ హ్యాండ్‌హెల్డ్ (AGARO Regal 800W Handheld):
చిన్న ఇళ్లకు.. అలాగే బడ్జెట్‌లో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ చాయిస్.
డిజైన్: ఇది చాలా లైట్ వెయిట్ ,కాంపాక్ట్. ఒక చేత్తో ఈజీగా పట్టుకుని క్లీన్ చేయవచ్చు.
పనితీరు: 800W మోటార్‌తో 6.5 kPa సక్షన్ పవర్ ఇస్తుంది. దీంతో సోఫాలు, ల్యాప్‌టాప్ కీబోర్డ్స్, కర్టెన్లు, కారు సీట్లను ఈజీగా క్లీన్ చేయొచ్చు.
ధర: రూ. 1,600 నుంచి రూ.2,100 లోపే లభిస్తుంది.
2. అగారో ఏస్ వెట్ & డ్రై (AGARO Ace 1600W Wet & Dry):
మీకు ఇల్లు మొత్తం డీప్ క్లీన్ కావాలి. అలాగే కింద పడిన లిక్విడ్స్‌ను కూడా క్లీన్ చేయాలి అనుకుంటే ఇది ఆల్ రౌండర్.
కెపాసిటీ: దీనికి ఏకంగా 21 లీటర్ల భారీ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది.
మల్టీ-టాస్కింగ్: ఇది కేవలం పొడి దుమ్మునే కాదు, కింద పారబోసిన పాలు, నీళ్లు లాంటి ద్రవాలను కూడా పీల్చేస్తుంది.
బ్లోయర్ ఫంక్షన్: ఇందులో పవర్‌ఫుల్ బ్లోయర్ కూడా ఉంది. కాబట్టి దీంతో బాల్కనీలోని ఎండిపోయిన ఆకులను, మూలల్లో ఉన్న దుమ్మును ఊదేయొచ్చు. 21.5 kPa సక్షన్ పవర్‌తో ఇదొక బీస్ట్ అని చెప్పొచ్చు.
ధర: రూ.6,000 నుంచి రూ.6,700 వరకు ఉంటుంది.
3. అగారో సుప్రీమ్ కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ (AGARO Supreme Cordless Stick):
వైర్ల గోల లేకుండా.. ఇల్లంతా ఫ్రీగా తిరుగుతూ క్లీన్ చేసుకోవడానికి ఈ మోడరన్ కార్డ్‌లెస్ మోడల్ అదిరిపోతుంది.
ఫీచర్స్: ఇందులో 400W బ్రష్‌లెస్ DC మోటార్ ఉంటుంది. అంతే కాకుండా ఇది 25 kPa అంత భారీ సక్షన్ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
బ్యాటరీ లైఫ్: ఒకసారి ఛార్జ్ చేస్తే లో-మోడ్‌లో 45 నిమిషాల పాటు నాన్-స్టాప్‌గా వాడుకోవచ్చు.
ఫిల్టరేషన్: ఇందులోని అడ్వాన్స్‌డ్ HEPA ఫిల్టర్ 99.9% మైక్రో డస్ట్‌ను లాగేసి గాలిని ప్యూర్ చేస్తుంది.
ధర: ప్రీమియం మోడల్ కాబట్టి ఇది సుమారు రూ. 14,000 నుంచి రూ. 15,000 రేంజ్‌లో ఉంటుంది.
4. అగారో రీగల్ ప్లస్ 2-ఇన్-1 అప్‌రైట్ (AGARO Regal Plus 2-in-1):
స్టిక్ వాక్యూమ్ లాగా నిలబడి ఫ్లోర్ క్లీన్ చేయడానికి.. అలాగే హ్యాండ్‌హెల్డ్ లాగా సోఫాలు క్లీన్ చేయడానికి ఈ 2-ఇన్-1 మోడల్ బాగా హెల్ప్ అవుతుంది.
లాభాలు: పొడవైన హ్యాండిల్ ఉండటం వల్ల నడుము వంచకుండా ఇల్లు తుడవచ్చు. 5 మీటర్ల పొడవైన వైర్ రావడం వల్ల రూమ్ అంతా ఈజీగా కవర్ చేయొచ్చు.
ధర: రూ.2,200 నుంచి రూ. 2,500 లోపే దొరుకుతుంది.
Also Read: గిన్నెలు కడిగే తిప్పలు ఇక లేనట్టే! ట్రెండ్ అవుతున్న టాప్ 5 బెస్ట్ డిష్‌వాషర్స్ ఇవే
అగారో వాక్యూమ్ క్లీనర్ల స్పెషాలిటీస్ ఏంటి?
హెపా ఫిల్టర్స్: అగారో మోడల్స్ ఎక్కువగా వాషబుల్ HEPA ఫిల్టర్లతో వస్తాయి. ఇవి కంటికి కనిపించని అలర్జీ కారకాలను ఫిల్టర్ చేస్తాయి. ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం.
మల్టిపుల్ అటాచ్‌మెంట్స్: ప్రతి మెషిన్‌తో పాటు క్రెవిస్ నోజిల్ (మూలల కోసం), బ్రష్ నోజిల్ (సోఫాల కోసం), ఫ్లోర్ బ్రష్ వంటి మల్టిపుల్ టూల్స్ ఫ్రీగా వస్తాయి.
వాల్యూ ఫర్ మనీ: వేరే ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో పోలిస్తే అగారో ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి.కానీ ధర చాలా తక్కువగా ఉంటాయి.
మీ బడ్జెట్ , అవసరాన్ని బట్టి మీరు సరైన అగారో వాక్యూమ్ క్లీనర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న క్లీనింగ్ అవసరాలకు, కార్ల కోసం అయితే Agaro Regal బెస్ట్. అదే ఇల్లు మొత్తం తడి, పొడి క్లీనింగ్ కోసం అయితే Agaro Ace సూపర్ ఆప్షన్. వైర్లు లేకుండా లగ్జరీగా ఉండాలంటే Agaro Supreme వైపు వెళ్ళొచ్చు. సో, స్మార్ట్‌గా ఆలోచించి మీ ఇంటికి సరిపోయే మోడల్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి!