E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లు.. మార్కెట్లోకి Xiaomi 400L స్మార్ట్ ఫ్రిడ్జ్.. గంటలోనే ఐస్ రెడీ!

బడ్జెట్ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లు.. మార్కెట్లోకి Xiaomi 400L స్మార్ట్ ఫ్రిడ్జ్.. గంటలోనే ఐస్ రెడీ!
Advertisement

Xiaomi Mijia Refrigerator: ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి తమ మిజియా లైనప్‌లో సరికొత్త స్మార్ట్ రిఫ్రిజిరేటర్‌ను చైనా మార్కెట్లోకి తీసుకొచ్చింది. Mijia French 400 Liter Automatic Ice Maker పేరుతో వచ్చిన ఈ ఫ్రిడ్జ్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్‌కు అందుబాటులో ఉంది. అత్యాధునిక ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో ఉన్న ఈ హోమ్ అప్లయన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గంటలోనే ఐస్ క్యూబ్స్ సిద్ధం:

ఈ కొత్త రిఫ్రిజిరేటర్ ప్రధాన ఆకర్షణ దీనిలోని ఆటోమేటిక్ ఐస్ మేకింగ్ సిస్టమ్. కేవలం 60 నిమిషాల్లోనే ఇది ఐస్ తయారు చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు చేసుకునే వారికి, ఎక్కువగా చల్లటి పానీయాలు ఇష్టపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఫ్రిడ్జ్‌లో బ్యాక్టీరియా చేరకుండా, చెడు వాసనలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన అయాన్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీని కూడా వాడారు.

అడ్జస్ట్ చేసేకునే సదుపాయం:

Advertisement

ఈ ఫ్రిడ్జ్ మొత్తం సామర్థ్యం 400 లీటర్లు. దీనిలో ప్రత్యేకంగా 50 లీటర్ల వేరియబుల్ టెంపరేచర్ కంపార్ట్‌మెంట్‌ను కూడా ఇచ్చారు. దీని ఉష్ణోగ్రతను మైనస్ 1 డిగ్రీ నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు మార్చుకోవచ్చు. దీనివల్ల మాంసం, చేపలు లేదా కూరగాయలను వాటికి తగిన ఉష్ణోగ్రతల్లో ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఒక సాధారణ కుటుంబానికి అవసరమైన అన్ని వసతులు ఈ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి.

Also Read: ఎండల ధాటికి పేలుతున్న ఫ్రిడ్జ్‌లు.. ఈ సౌండ్స్ వస్తే జాగ్రత్త, లేదంటే బ్లాస్టే!

ఫోన్‌ నుంచే ఆపరేటింగ్:

Advertisement

షావోమి హైపర్ ఓఎస్ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫ్రిడ్జ్‌ను ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఆన్‌లో ఉన్నప్పుడు అస్సలు సౌండ్ రాదు. అలాగే కిచెన్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా ఉండేలా చాలా స్లిమ్‌గా, ఆప్రికాట్ కలర్ ఫినిషింగ్‌తో దీనిని డిజైన్ చేశారు. ఈ ఫ్రిడ్జ్ కంప్రెసర్‌పై ఏకంగా 10 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు.

ధర ఎంతంటే?

చైనా మార్కెట్లో దీని అసలు ధర 2,999 యువాన్లు కాగా.. అక్కడి ప్రభుత్వ సబ్సిడీల తర్వాత సుమారు 2,549 యువాన్లకే లభిస్తోంది. కేవలం స్మార్ట్‌ఫోన్లు, ఈవీ కార్లే కాకుండా గృహోపకరణాల రంగంలోనూ తాము బెస్ట్ అని షావోమి ఈ కొత్త ఫ్రిడ్జ్‌తో మరోసారి నిరూపించింది. అయితే ఈ ఫ్రిడ్జ్ ఇండియాలో విడుదలయ్యాక ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు.

Also Read: ఏసీ లేకపోయినా ఇల్లు కూల్ కూల్‌గా ఉండాలా? అయితే మన తాతల కాలపు ఈ ‘కూలింగ్ హ్యాక్స్’ ట్రై చేయండి!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×