E-Paper
Advertisement

విద్యార్థుకు ఘనంగా సన్మానం.. పెద్ద మనుసు చాటుకున్నసమతాక్షర సేవా సమితి!

విద్యార్థుకు ఘనంగా సన్మానం.. పెద్ద మనుసు చాటుకున్నసమతాక్షర సేవా సమితి!
Advertisement

Student Felicitation: స్వేచ్ఛ బ్యూరో: సమతాక్షర జ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో పాతపాలమూర్ 10వ డివిజన్‌కు చెందిన పదో తరగతి ఉత్తీర్ణ విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను మెమెంటోలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటౌన్ సీఐ అప్పయ్య, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్ధన్, పాతపాలమూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, 10వ డివిజన్ కార్పొరేటర్ టి. రమేష్ బాబు హాజరయ్యారు.

మహత్ముల ఆశయాలకు..

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగితే జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించిన సమితి సభ్యులను వారు అభినందించారు.

Advertisement

Also read: జియో బంపరాఫర్.. 84 రోజుల పాటు.. ఫ్రీ ఓటీటీలతో పాటు రోజూ 2GB డేటా!

హర్షం వ్యక్తం

విద్యార్థుల సత్కార కార్యక్రమంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బి. హరిదాస్, ఉపాధ్యక్షుడు కె. అశోక్, ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు, సహాయ కార్యదర్శి ఆంజనేయులు, సంజీవ్ రాజు, పి. యాదయ్య, పి. ఆంజనేయులు, జగదీశ్, బాలకృష్ణ, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: బండి సంజయ్ ఏ త‌ప్పూ చేయ‌లేదు..! కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు బీజేపీ అధిష్టానం మూతోడ్ జవాబ్‌..!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×