E-Paper
Advertisement

IPL Recharge Plans 2026: ఐపీఎల్ స్పెషల్.. హాట్‌స్టార్ ఫ్రీగా లభించే.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

IPL Recharge Plans 2026: ఐపీఎల్ స్పెషల్.. హాట్‌స్టార్ ఫ్రీగా లభించే.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Advertisement

IPL Recharge Plans: దేశంలో అతిపెద్ద క్రికెట్ పండుగ రాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2026 సీజన్.. మార్చి 28 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాబట్టి ఐపీఎల్ చూడాలంటే హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. అయితే క్రికెట్ ప్రియులను ఉద్దేశించి ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి ప్రముఖ టెలికాం సంస్థల్లో తక్కువ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చాయి. వీటిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏవి? వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 100 ప్లాన్

జియో తన యూజర్ల కోసం ఈ యాడ్ ఆన్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో ఉచితంగా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ కింద 5GB హై స్పీడ్ డేటాను సైతం అందిస్తారు.

జియో రూ. 500 ప్లాన్

Advertisement

హాట్ స్టార్ తో పాటు మరిన్ని ఓటీటీల సబ్ స్క్రిప్షన్ కోరుకునే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందియ 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద హాట్ స్టార్ తో పాటు ప్రైమ్ వీడియో (మెుబైల్ వెర్షన్), సోనీ లివ్, Zee5, డిస్కవరి + ఓటీటీల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే యూట్యూబ్ ప్రీమియం కంటెంట్ ను సైతం అస్వాదించవచ్చు. అంతేకాకుండా రోజుకు 2GB డేటాతో పాటు ఫ్రీ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను వినియోగదారులు పొందొచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్

తక్కువ బడ్జెట్ లో ఫ్రీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందించే చౌకైన ఎయిర్ టెల్ ప్లాన్ గా దీనిని చెప్పవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్ స్టార్ తోపాటు గూగుల్ వన్, సోనీ లివ్, ఆపిల్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే రోజుకు 4GB డేటా, ఫ్రీ కాల్స్, 100SMSలు పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 398 ప్లాన్

Advertisement

ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో ఉచితంగా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. అయితే అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ మినహా మరే ఇతర అదనపు ఓటీటీ ప్రయోజనాలు లభించవు. అయితే రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలను ఈ ప్లాన్ అందిస్తుంది.

Also Read: Gold Price Fall: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం రివర్స్ ట్రెండ్.. ఎందుకీ విచిత్ర పరిస్థితి!

వీఐ రూ. 202 ప్లాన్

తక్కువ బడ్జెట్ లో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కోరుకునే వీఐ యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. నెల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్ స్టార్ తో పాటు సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ప్లేఫ్లిక్స్, ఫ్యాన్‌కోడ్, మనోరమాక్స్ వంటి ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొబైల్ తో పాటు టీవీ రెండింటిలోనూ జియోహాట్‌స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు.

Also Read: Butterfly vs Philips: మధ్యతరగతి బ్రాండ్స్.. ఈ రెండు ఇండక్షన్స్ స్టవ్స్‌లో.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×