E-Paper
Advertisement

Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది
Advertisement

Inzamam-ul-Haq: టీమిండియా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడేళ్లలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందుకుంది టీమిండియా. 2024లో టి20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఈ రెండు ట్రోఫీలు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అందుకోగా, లేటెస్ట్ గా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 వరల్డ్ కప్ అందుకుంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా పై పాకిస్తాన్ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఫిక్సింగ్ చేసి ఇండియా విజయం సాధించిందని పదేపదే ఆరోపణలు చేస్తోంది పాకిస్తాన్. అయితే లేటెస్ట్ గా ఇదే విషయంపై మరోసారి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) స్పందించారు. ఇకపై టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవకుండా అడ్డుకుంటామని, పాకిస్తాన్ గెలిచేలా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 2027 నుంచి వరుసగా ఐదు వరల్డ్ కప్ లు పాకిస్తానే గెలుస్తుందని సంచలన ప్రకటన కూడా చేశారు ఇంజమామ్ వుల్ హక్.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు

Advertisement

టీమిండియా వరుసగా ఐసీసీ టోర్నమెంట్లు గెలవడంపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేసి ఇన్ని రోజులు ఐసీసీ ట్రోఫీలను టీమిండియా గెల్చుకుందని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్. అయితే ఇకపై టీమిండియా ఒక్క ట్రోఫీ కూడా గెలవబోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 నుంచి టీమిండియాకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా దక్కనివ్వకుండా అడ్డుకుంటామని అల్లా మీద ఒట్టేసి శపథం చేశారు ఇంజమామ్ వుల్ హక్. మరో 10 సంవత్సరాల పాటు టీమిండియా కు టైటిల్ రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించాడు. అదే సమయంలో పాకిస్తాన్ వరుసగా 5 వరల్డ్ కప్ లు సొంతం చేసుకుంటుంద‌ని పేర్కొన్నారు. వ‌చ్చే పది సంవత్సరాల పాటు ప్రపంచ క్రికెట్ ను పాకిస్తాన్ శాసిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇంజమాం.

రంజాన్ కంటే ముందు తాను ఈ మాట ఇస్తున్నానని వెల్లడించారు. ఇక ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. టి20 వరల్డ్ కప్ కాదు బంగ్లాదేశ్ చేతిలో కూడా వన్డే సిరీస్ ఓడిపోయిన పాకిస్తాన్, వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలవడం అసాధ్యమని ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఇంజమామ్ వుల్ హక్ గాడికి నడవడమే చేతకాదు.. పాకిస్తాన్ కు 5 వరల్డ్ కప్ లు ఎలా తీసుకువస్తాడని మండిపడుతున్నారు. ముందుగా బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ లాంటి జట్లపైన వన్డే సిరీస్లు గెలిచి చూపించాలని ర్యాగింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ కాదు ఇకపై ఐసీసీ ట్రోఫీలన్నీ టీమిండియావేన‌ని పోస్టులు పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×