E-Paper
Advertisement

Gold Price Fall: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం రివర్స్ ట్రెండ్.. ఎందుకీ విచిత్ర పరిస్థితి!

Gold Price Fall: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం రివర్స్ ట్రెండ్.. ఎందుకీ విచిత్ర పరిస్థితి!
Advertisement

Gold Price Fall: దేశాల మధ్య తలెత్తే యుద్ధం, ఉద్రిక్తత పరిస్థితుల వల్ల సాధారణంగా పసిడి ధరలు భారీ ఎత్తున పెరుగుతుంటాయి. కానీ ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బంగారం రివర్స్ ట్రెండ్ అవుతోంది. ధరలు పెరగాల్సిందిపోయి.. ఇందుకు భిన్నంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఒక్కరోజే (మార్చి 17) అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర ఏకంగా 5000 డాలర్లకు దిగువకు పడిపోయింది. దాదాపు 1శాతం వరకూ బంగారం ధర తగ్గిపోయింది. అయితే ఇలా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి గల ప్రత్యేక కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

అమెరికా డాలర్ బలోపేతం

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారంతో పాటు అమెరికా డాలర్‌ను కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటంతో ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారి డిమాండ్ తగ్గింది.

వడ్డీ రేట్లపై అనిశ్చితి

Advertisement

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు పెట్టుబడిదారుల్లో పెరిగిపోయాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం వంటి వడ్డీ లేని ఆస్తుల కంటే బాండ్లు, డిపాజిట్లపై పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు.

క్రూడ్ ఆయిల్ ప్రభావం

ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది పలు దేశాల్లో ద్రవ్యోల్బణానికి (Inflation) దారి తీస్తోంది. దీంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ  నేపథ్యంలో బంగారంపై సహజంగానే ఒత్తిడి పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

లాభాల స్వీకరణ

Advertisement

ఇటీవల కొద్ది నెలలు వరకూ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఓ దశలో ఔన్సు బంగారం ధర ఏకంగా 5,500 డాలర్ల వరకూ పెరిగింది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం (అమ్మకాలు చేపట్టడం) వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి.

Also Read: Butterfly vs Philips: మధ్యతరగతి బ్రాండ్స్.. ఈ రెండు ఇండక్షన్స్ స్టవ్స్‌లో.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

లిక్విడిటీ అవసరాలు

మరోవైపు యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున కుప్పకూలుతున్నాయి. ఆ నష్టాలను భర్తీ చేయడానికి లేదా చేతిలో నగదు ఉంచుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది.

ముఖ్య గమనిక: మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరలు తగ్గుదల తాత్కాలికం మాత్రమే. ఉద్రిక్తతలు మరింత పెరిగితే బంగారం మళ్లీ తన ‘సేఫ్ హెవెన్’ హోదాను చాటుకుంటూ ధరలు పుంజుకునే అవకాశం ఉంది.

Also Read: Satellite Smartwatch: శాటిలైట్‌ స్మార్ట్ వాచ్.. భూమ్మిద ఎక్కడ అపాయంలో ఉన్నా.. ఇట్టే పసిగట్టి కాపాడేస్తది!

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×