E-Paper
Advertisement

ఫ్రిజ్ కొంటున్నారా? సింగిల్ డోర్, డబుల్ డోర్, ఇన్వర్టర్ టెక్నాలజీలలో ఏది బెస్ట్?

ఫ్రిజ్ కొంటున్నారా? సింగిల్ డోర్, డబుల్ డోర్, ఇన్వర్టర్ టెక్నాలజీలలో ఏది బెస్ట్?
Advertisement

Best Refrigerator 2026: ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) తప్పనిసరిగా మారిపోయింది. వండిన వంటకాలు పాడవకుండా దాచుకోవాలన్నా, చల్లటి నీటిని తాగాలన్నా ప్రతీ ఇంట్లో ఫ్రిడ్జ్ నిత్యవసరం అయిపోయింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బ్రాండ్లు, సరికొత్త ఫీచర్లతో వందలాది మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ ఫ్రిడ్జ్ కొనాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 2026లో సరికొత్త టెక్నాలజీతో వస్తున్న రిఫ్రిజిరేటర్ల గురించి.. వాటిలో ఏది ఇంటికి సరిపోతుందో ఈ కథనంలో చూద్దాం.

సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు

బ్యాచిలర్స్ తో పాటు ఇంట్లో ఇద్దరు-ముగ్గురు మాత్రమే ఉండేవారికి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ సరిగ్గా సరిపోతుంది. ఇవి సాధారణంగా 150 లీటర్ల నుండి 230 లీటర్ల సామర్థ్యంతో వస్తాయి. ఫ్రీజర్, జనరల్ సెక్షన్ రెండూ ఒకే డోర్ లోపల ఉంటాయి. ప్లస్ పాయింట్స్ కు వస్తే.. ఇది బడ్డెట్ లో లభిస్తుంది. తక్కువ స్పేస్ ను వంటగదిలో తీసుకుంటుంది. మైనస్ పాయింట్స్ చూస్తే.. ఫ్రీజర్ లో పేరుకుపోయిన మంచును మాన్యువల్ గా క్లీన్ చేయాల్సి రావడం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు.

డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు

Advertisement

నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. వీటిలో ఫ్రీజర్ కోసం పైభాగంలో విడిగా ఒక డోర్, కింద సాధారణ కూరగాయలు, పాలు పెట్టుకోవడానికి మరో డోర్ ఉంటుంది. ఇవి 230 లీటర్ల నుండి 500 లీటర్ల పైగా సామర్థ్యంతో లభిస్తాయి. లాభాల విషయానికి వస్తే.. ఇవి ‘ఫ్రాస్ట్-ఫ్రీ’ టెక్నాలజీతో వస్తాయి. ఫ్రిడ్జ్ లోపల మంచు పేరుకుపోదు. నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మైనస్ లకు వస్తే.. సింగిల్ డోర్ ఫ్రిజ్‌లతో పోలిస్తే ధర, కరెంట్ వినియోగం కొంచెం ఎక్కువే.

ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్రిడ్జ్

ప్రస్తుతం ఫ్రిడ్జ్ కొనేటప్పుడు అందరూ చూసే ప్రధాన ఫీచర్ ‘డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్’. సాధారణ ఫ్రిజ్ కంప్రెసర్లు అప్పుడప్పుడు ఆన్, ఆఫ్ అవుతూ ఎక్కువ కరెంట్ లాగుతాయి. కానీ ఇన్వర్టర్ కంప్రెసర్ ఎప్పుడూ ఆఫ్ అవ్వదు. ఫ్రిజ్ లోపల ఉన్న ఆహార పదార్థాల లోడ్‌ను బట్టి, బయట వాతావరణాన్ని బట్టి తన వేగాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి పవర్ బిల్లు 30% నుండి 40% వరకు ఆదా అవుతుంది. చాలా కంపెనీలు వీటిపై 10 నుండి 20 ఏళ్ల వారంటీ ఇస్తుండటం విశేషం.

Advertisement

Also Read: ఇంటి పైకప్పును.. చల్లదనంతో నింపే.. 4 అద్భుతమైన చిట్కాలు ఇవే!

ఫైనల్గా ఏది బెస్ట్?

ప్రస్తుతం చాలా వరకూ సింగిల్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు ఇన్వర్టర్ టెక్నాలజీతోనే వస్తున్నాయి. 2-3 సభ్యులు ఉండి, తక్కువ బడ్జెట్ లో ఫ్రిడ్జ్ కావాలని కోరుకుంటే.. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ట్రై చేయవచ్చు. తక్కువ సామర్థ్యం ఉండటం వల్ల విద్యుత్ ను పొదుపుగా వినియోగిస్తుంది. అలా కాకుండా ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉండి.. పవర్ ఫుల్ కూలింగ్ ను కోరుకుంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను తీసుకోవచ్చు. వీటిలో మంచు క్లీన్ చేసే తలనొప్పి కూడా ఉండదు. మెుత్తంగా మీ అవసరం, అభిరుచికి తగ్గట్లుగా ఉన్న ఫ్రిడ్జ్ ను మీరే ఎంచుకోండి.

Also Read: ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు, ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×