E-Paper
Advertisement

ఇంటి పైకప్పును.. చల్లదనంతో నింపే.. 4 అద్భుతమైన చిట్కాలు ఇవే!

ఇంటి పైకప్పును.. చల్లదనంతో నింపే.. 4 అద్భుతమైన చిట్కాలు ఇవే!
Advertisement

Roof Cooling Tips: ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే రోజుల్లో.. ఇళ్లు నిప్పుల కొలిమిని తలపిస్తుంటాయి. ముఖ్యంగా పైఅంతస్తుల్లో ఉండేవారి పరిస్థితి వేసవిలో చాలా దారుణంగా ఉంటుంది. ఫ్యాన్లు వేస్తే వేడి గాలి.. ఏసీ ఆన్ చేస్తే అధిక విద్యుత్ బిల్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అయితే వీటికి చెక్ పెడుతూ ఇంటి పైకప్పును చల్లగా మార్చే అద్భుతమైన టిప్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఇవి మీ రూఫ్ ను చల్లగా ఉంచుతూ.. ఇంటి లోపలి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తాయి.

కూల్ రూఫ్ పెయింటింగ్

ఇంటి కప్పును చల్లబరచడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. డాబాపై ‘కూల్ రూఫ్ పెయింట్’ లేదా తెల్లటి సున్నాన్ని కోటింగ్‌లా వేయాలి. ఇలా చేస్తే సూర్యకిరణాలు తిరిగి పరావర్తనం చెంది.. దాదాపు 70% నుండి 80% వరకు వేడి ఇళ్లలోకి చేరకుండా ఆగిపోతుంది. ఏడాదికి ఒకసారి దీనిని అప్లై చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటిపై చిన్నపాటి తోట

Advertisement

ఇంటిపై భాగాన్ని గార్డెనింగ్ గా మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డాబాపై కుండీలలో లేదా గ్రో బ్యాగులలో మొక్కలను పెంచడం వల్ల సూర్యకాంతి నేరుగా కాంక్రీట్ స్లాబ్‌పై పడదని పేర్కొంటున్నారు. మొక్కలు, తడిచిన మట్టి ఆ వేడిని పీల్చుకుని.. శ్లాబ్ ను చల్లగా, తేమగా ఉంచుతాయని తెలియజేస్తున్నారు.

తాటి ఆకులతో పందిరి

పల్లెటూళ్లలో ఇళ్లు చల్లగా ఉండటానికి పైకప్పులపై గడ్డి వేయడం చూసే ఉంటాం. అదే సూత్రాన్ని నగరాల్లోనూ పాటించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి రూఫ్ పైన ఎండు గడ్డిని పరచడం లేదా గోను సంచులతో చిన్నపాటి పందిరి లాగా ఏర్పాటు చేయాలని హితవు పలుకుతున్నారు. అవి సూర్యుడి వేడిని నేరుగా సిమెంట్ స్లాబ్‌కు తాకనివ్వవని తెలియజేస్తున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. మరో గంటలో ఆ ప్రాంతాల్లోనూ భారీ వర్షం!

చలువ ఇచ్చే టైల్స్

రూఫ్ చల్లదనానికి శాశ్వత పరిష్కారం కోరుకుంటే.. దీనిని ట్రై చేయవచ్చు. ఇంటి పైకప్పు పైన తెల్లటి చైనా మొజాయిక్ ముక్కలను (broken ceramic tiles) గానీ, మట్టితో చేసిన కూలింగ్ టైల్స్ గానీ వేయాలని సూచిస్తున్నారు. ఈ సెరామిక్ ముక్కలు వేడిని లోపలికి రానివ్వకుండా సహజ పద్దతిలో ఇంటి రూఫ్ ను కూల్ గా ఉంచుతాయని స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఐఫోన్ వాడితే పిల్లలు పుట్టరా? లైఫ్‌లో పేరెంట్స్ కాలేరా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Related News

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!

భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో Oppo A7 Pro లాంచ్.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×