E-Paper
Advertisement

Gaokao Security: చైనాలో క్వశ్చన్ పేపర్ తయారీ వెనుక ఉన్న నయా సీక్రెట్.. తెలిస్తే మతి పోవాల్సిందే..?

Gaokao Security: చైనాలో క్వశ్చన్ పేపర్ తయారీ వెనుక ఉన్న నయా సీక్రెట్.. తెలిస్తే మతి పోవాల్సిందే..?

Gaokao Security: చైనాలో నిర్వహించే గావోకావో ఎంట్రన్స్ టెస్ట్ కేవలం ఒక పరీక్షలా కాకుండా, ఒక నేషనల్ సెక్యూరిటీ మిషన్ లా భావిస్తుంది. జూన్ 7 నుంచి 10 వరకు జరిగే పరీక్షల కోసం ఒక కోటీ 30 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ, క్వశ్చన్ పేపర్ లీక్ అనేది చైనాలో దాదాపు అసాధ్యంగా మారింది. చైనా ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ తయారీ నుండి పరీక్ష ముగిసే వరకు పాటించే మిలిటరీ స్థాయి భద్రత, టెక్నాలజీ వాడుతుంటుంది.

నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా..

పరీక్షకు మూడు నెలల ముందే, ప్రశ్నపత్రాలను తయారు చేసే ప్రొఫెసర్లు, నిపుణులను ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు లేదంటే హై సెక్యూరిటీ మిలిటరీ బేస్‌లకు తరలిస్తారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్స్ ఏవీ ఉండవు. వారు తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి వీల్లేదు. పరీక్షలన్నీ పూర్తయ్యే వరకు వారు ఆ క్యాంపుల నుంచి బయటకు రావడానికి అనుమతి ఉండదు. ఇప్పుడు మన దగ్గర నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇన్నాళ్లూ మన దగ్గర పేపర్ తయారు చేసిన వాళ్లు బయటే ఉండే వారు. పేపర్ తయారీలో పాల్గొన్న వారి ప్రమేయం కూడా ఉందని సీబీఐ తాజాగా గుర్తించి అరెస్ట్ చేసింది.

నేషనల్ సీక్రెట్స్ అథారిటీ..

గావోకావో ప్రశ్నపత్రాలను చైనా చట్టాల ప్రకారం టాప్ స్టేట్ సీక్రెట్ గా పరిగణిస్తారు. ఈ పేపర్లను చైనా విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ సీక్రెట్స్ అథారిటీ పరిధిలోని ప్రత్యేక జైళ్లలో లేదా భద్రత ఎక్కువున్న ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రిస్తారు. అక్కడ పనిచేసే సిబ్బంది కూడా పరీక్షలు అయిపోయే వరకు బయటకు రాలేరు. ఆ ప్రెస్‌ల చుట్టూ 24 గంటల సీసీటీవీ కెమెరాలు, మోషన్ సెన్సార్లు ఉంటాయి. ప్రింట్ అయిన క్వశ్చన్ పేపర్లను వివిధ నగరాలలోని పరీక్షా కేంద్రాలకు తరలించే ప్రక్రియ ఒక దేశపు అణ్వాయుధ కోడ్‌లను మార్చినంత కట్టుదిట్టంగా ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులలో, సాయుధ పోలీసులు, స్పెషల్ SWAT టీమ్స్ కాపలాతో వీటిని రవాణా చేస్తారు. ప్రతి ట్రక్కుకు ప్రత్యేక జిపిఎస్ ట్రాకింగ్, లైవ్ శాటిలైట్ మానిటరింగ్ ఉంటుంది.

Also read: Cyber Hacking: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అకౌంట్ హ్యక్ కలకలం

కెమెరాల్లో AI సాఫ్ట్‌వేర్‌..

ఈ ఏడాది పరీక్షను మరింత లీక్ ప్రూఫ్, కాపీయింగ్ రహితంగా మార్చడానికి చైనా సరికొత్త వ్యూహాలను అమలు చేసింది. ఈ ఏడాది స్మార్ట్ గ్లాసెస్ ద్వారా పేపర్లు లీక్ అవ్వకుండా చూడటానికి విద్యార్థుల కళ్లద్దాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కళ్లద్దాలు ధరించే విద్యార్థులు వాటిని సెక్యూరిటీ గేట్ వద్ద తీసి అధికారులకు ఇవ్వాలి, వారు వాటి సైజు, షేప్ లోపల ఏవైనా చిప్స్ ఉన్నాయా అని వీడియో నిఘా కింద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. పరీక్ష జరిగే రోజుల్లో చైనాలోని ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ అధునాతన AI చాట్‌బాట్ల లోని ఫొటో రికగ్నిషన్, రియల్ టైమ్ క్వశ్చన్ ఆన్సర్ ఫీచర్లను తాత్కాలికంగా బ్లాక్ చేశాయి. ఎవరైనా దొంగచాటుగా క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి AI కి పంపినా, అది సమాధానం ఇవ్వకుండా పరీక్షల పారదర్శకత కోసం ఈ సేవలు నిలిపేశాం అని మెసేజ్ వచ్చేలా లాక్ చేశారు. అంతే కాదు పరీక్షా కేంద్రాల్లోని కెమెరాల్లో AI సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. ఒక విద్యార్థి పక్కకు పదే పదే చూడటం, కళ్లు వింతగా తిప్పడం, క్లాస్ రూమ్ ఇన్విజిలేటర్ ఏదైనా తప్పుడు సిగ్నల్స్ చేయడం వంటివి జరిగితే AI వెంటనే పట్టుకుని, ఆ వీడియో క్లిప్‌ తో కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపుతుంది.

దేశద్రోహంతో సమానం..

విద్యార్థి వేలిముద్రలు, ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ మూడు మ్యాచ్ అయితేనే లోపలికి పంపుతారు. దీనివల్ల ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసే అవకాశం లేదు. పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మొబైల్ నెట్‌వర్క్, బ్లూటూత్, వైఫై లేదా రేడియో సిగ్నల్స్ పనిచేయకుండా హై పవర్ జామర్లను ఆన్ చేశారు. ఆకాశంలో డ్రోన్ల ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీలను నిరంతరం స్కాన్ చేస్తున్నారు. ఫైనల్ గా చైనా చట్టాల ప్రకారం గావోకావో పరీక్షలో పేపర్ లీక్‌కు పాల్పడినా, లేదా లీక్ చేయడానికి ప్రయత్నించినా, కాపీ కొట్టినా దాన్ని దేశద్రోహంతో సమానమైన నేరంగా పరిగణిస్తారు. నిందితులకు నేర తీవ్రతను బట్టి 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. సదరు విద్యార్థిని జీవితంలో మరే ఇతర ప్రభుత్వ పరీక్షలు రాయకుండా బ్యాన్ చేస్తారు. టెక్నాలజీ, ప్రభుత్వ పట్టుదల, కఠిన శిక్షల భయంతోనే చైనాలో పేపర్ లీకులు అసాధ్యంగా మారాయంటున్నారు.

Also read: TMC Revolt: మూడు ముక్కలైన తృణమూల్ కాంగ్రెస్.. మౌనంగా ఉన్న ఆ మూడో వర్గం కథేంటో..?

Related News

PM Modi: నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన ప్రధాని మోడీ.. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర..!

RajyaSabha Elections: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నయా ట్విస్ట్.. నంబర్లు లేకపోయినా అభ్యర్థులను దింపిన బీజేపీ!

TMC Revolt: మూడు ముక్కలైన తృణమూల్ కాంగ్రెస్.. మౌనంగా ఉన్న ఆ మూడో వర్గం కథేంటో..?

Anuroop Reddy: నీ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్..!

Cyber Hacking: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అకౌంట్ హ్యక్ కలకలం

E85 Fuel: సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా.. కేంద్రం గుడ్ న్యూస్..?

మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

×