Vijay Sales Holi Sale 2026: హోలీ పండుగ రాకముందే విజయ్ సేల్స్ తమ కస్టమర్ల కోసం దిమ్మతిరిగే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లతో పాటు దాదాపు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ వేసవికి కావాల్సిన కూలింగ్ గ్యాడ్జెట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. తక్కువ బడ్జెట్‌లో ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అన్నీ కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి కావాల్సిన పార్టీ స్పీకర్లు కేవలం రూ.3,599 నుంచే అందుబాటులో ఉన్నాయి. ఇతర ఆడియో ఉత్పత్తులు, హెడ్‌ఫోన్లు రూ.2,499 నుంచి లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం కెమెరా ఫోన్లను కేవలం రూ.6,399 ప్రారంభ ధరకే అందిస్తున్నారు. ఒకవేళ మీరు కొత్త టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. స్మార్ట్ టీవీలు రూ.8,990 నుంచే ప్రారంభమవుతున్నాయి.
Also Read: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17e విడుదల తేదీ, ఫీచర్లు, ధర వివరాలివే!
ఎండలు ముదురుతున్న తరుణంలో ఏసీల ధరలను భారీగా తగ్గించారు. కొత్త ఏసీలు రూ.24,299 నుంచి, రిఫ్రిజిరేటర్లు రూ.8,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. పండుగ తర్వాత రంగుల మరకలను వదిలించుకోవడానికి అవసరమయ్యే వాషింగ్ మెషీన్లు రూ.9,800 ప్రారంభ ధరతో సేల్‌లో ఉన్నాయి. వంటగది అవసరాల కోసం మైక్రోవేవ్ ఓవెన్లు రూ.5,999కు, ఎయిర్ ఫ్రైయర్లు రూ.2,699కు లభిస్తున్నాయి. మిక్సర్లు, కెటిల్స్ వంటి చిన్న వస్తువులు కేవలం రూ.499కే సొంతం చేసుకోవచ్చు.
ఇక పర్సనల్ కేర్ ఉత్పత్తులు రూ.499 నుంచి, స్మార్ట్ వాచీలు రూ.1,249 నుంచి ప్రారంభమవుతున్నాయి. గేమర్స్ కోసం ప్లేస్టేషన్ గేమ్స్, ఇతర యాక్సెసరీలపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. వైర్లెస్ ఇయర్‌బడ్స్ కొనేవారికి రూ.599కే మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ధరల తగ్గింపుతో పాటు హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంక్ కార్డులపై రూ.7,500 నుండి రూ.15,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్‌బిసి, వన్ కార్డ్ వంటి ఇతర బ్యాంకుల కార్డులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు MyVS ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కొనుగోలుపై లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. వీటిని తర్వాతి కొనుగోళ్లలో వాడుకోవచ్చు.
Also Read: ఇది కలా.. నిజమా? అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై రూ.32,000 ఫ్లాట్ డిస్కౌంట్!