E-Paper
Advertisement

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!
Advertisement

Best washing machine on Amazon August 2026: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో బట్టలు ఉతకడం అంటే కష్టంతో కూడుకున్న పని. అందుకే ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొనాలన్నా ముందుగా మనం చూసేది అమెజాన్ రివ్యూలు , బెస్ట్ సెల్లర్స్ లిస్టే. తాజాగా ఆగస్ట్ నెలలో అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌ లో డిమాండ్ ఉన్న టాప్-5 వాషింగ్ మెషీన్ మోడల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటి ఫీచర్లు, ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 వాషింగ్ మెషీన్స్:  

1.Samsung 7 kg EcoBubble Front Load:

ఆగస్ట్ నెలలో అమెజాన్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న మోడల్ ఇది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అంతే కాకుండా ఇందులో ఉన్న ‘ఇకో బబుల్’ టెక్నాలజీ ద్వారా డిటర్జెంట్ త్వరగా నురగగా మారి బట్టలలోని మొండి మరకలను ఇట్టే తొలగిస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల తక్కువ కరెంట్, తక్కువ నీటిని ఇది వినియోగిస్తుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్ నుంచే దీన్ని కంట్రోల్ చేయొచ్చు.

2. LG 8 kg AI Direct Drive Front Load:

Advertisement

పెద్ద కుటుంబాల కోసం అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఎల్జీ బ్రాండ్‌ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే.. ఈ మెషీన్, బట్టల బరువు, రకాన్ని బట్టి ఆటోమేటిక్‌గా వాషింగ్ మోషీన్‌ను సెట్ చేసుకుంటుంది. డైరెక్ట్ డ్రై టెక్నాలజీ వల్ల మెషీన్ తిరిగేటప్పుడు ఎలాంటి సౌండ్ రాదు. వైబ్రేషన్స్ అసలు ఉండవు. ఇది హైజీన్ కోసం స్టీమ్ వాష్ ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.

3.Whirlpool 6.5 kg Top Load:

బ్యాచిలర్స్, చిన్న కుటుంబాల కోసం బడ్జెట్ ధరలో.. లభించే బెస్ట్ వాషింగ్ మెషీన్ ఇది. అమెజాన్‌లో దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. హార్డ్ వాటర్ ఉన్న ప్రాంతాల వారికి ఇది చాలా బాగా పని చేస్తుంది. వాటర్ కండిషనర్ టెక్నాలజీ ద్వారా కఠినమైన నీటిలో కూడా బట్టలు తెల్లగా మెరుస్తాయి. అంతే కాకుండా లోపల వాటర్ లెవల్ ఎంత ఉండాలి, డిటర్జెంట్ ఎంత పడుతుంది అనేది ఆటోమేటిగ్గా సెన్స్ చేసుకుంటుంది.

Advertisement

Also Read: బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

4.Bosch 7 kg Front Load:

జర్మన్ టెక్నాలజీతో తయారైన బాష్ వాషింగ్ మెషీన్లు వాటి క్వాలిటీకి పెట్టింది పేరు. సెప్టెంబర్ సేల్స్‌లో ఇవి టాప్ లిస్టులో నిలిచాయి. యాంటీ-టాంగిల్ ఫీచర్ ఉండటం వల్ల.. ఉతికేటప్పుడు బట్టలు ఒకదానికొకటి చిక్కుపడకుండా.. ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో.. సేఫ్టీ కోసం చైల్డ్ లాక్ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది. తక్కువ సౌండ్‌తో పని చేయడం దీని మరో ప్రత్యేకత.

5.IFB 6.5 kg Aqua Energie Top Load:

ఇండియన్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా ఉన్న ఐఎఫ్బీ మోడల్ ఐదవ స్థానంలో నిలిచింది.’అక్వా ఎనర్జీ’ వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్ ద్వారా.. నీటిలోని మలినాలను తొలగించి డిటర్జెంట్‌ను బట్టలకు బాగా పట్టేలా చేస్తుంది. కంపెనీ అందించే.. మోటార్ వారంటీ కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.

Related News

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

Big Stories

Advertisement
×