E-Paper
Advertisement

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్
Advertisement

Janmashtami Radha Rani makeup for girls| శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే ఇళ్లలో సందడి మొదలవుతుంది. ఈ సందర్భంగా పిల్లలను కృష్ణుడు, రాధ వేషాల్లో అలంకరించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు రాధ లుక్‌లో ఎంతో ముద్దుగా కనిపిస్తారు. ఇందుకోసం ఖరీదైన కాస్ట్యూమ్స్ లేదా హెవీ మేకప్ అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉన్న దుస్తులు, పూలు, నగలు, చిన్న ప్రాప్స్‌తోనే అందమైన లుక్‌ తయారు చేయవచ్చు. ఫొటోల్లో కూడా మీ చిన్నారి ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది.

సరైన డ్రెస్ ఎంచుకోవడం ముఖ్యం

ముందుగా మీ చిన్నారికి సౌకర్యంగా ఉండే సంప్రదాయ దుస్తులను ఎంచుకోండి. లెహంగా చోలీ (లంగా బ్లౌజ్) , ఘాగ్రా చోలీ లేదా సంప్రదాయ ఫ్రాక్ మంచి ఎంపికగా ఉంటాయి. పింక్, ఎరుపు, పసుపు, రాణి పింక్ లేదా పాస్టెల్ రంగులను ఎంచుకోండి. పిల్లలకు బరువైన దుస్తులకు బదులుగా తేలికైన డ్రెస్‌నే ఎంచుకోవడం మంచిది. మ్యాచింగ్ కోసం సరిపోయే దుపట్టా ఉంటే చిన్నారి తలపై అందంగా అలంకరించవచ్చు. దుపట్టా బిగుతుగా లేకుండా సౌకర్యంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

బొట్టు, తిలకంతో అందం

Advertisement

రాధా లుక్‌కు చిన్న బొట్టు అందమైన సంప్రదాయ టచ్ ఇస్తుంది. బొట్టు చుట్టూ చిన్న చిన్న బిందీలను పెట్టడం ద్వారా లుక్‌ మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. చెంపపై చిన్న నల్లటి చుక్క కూడా ముద్దుగా కనిపిస్తుంది. చిన్నారులకు ఎక్కువ మేకప్ చేయకుండా సహజమైన లుక్‌ తోనే ఉంచడం మంచిది. సింపుల్ మేకప్‌తోనే ఫొటోల్లో అందమైన ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి.

జుట్టుకు పూల అలంకరణ

రాధ లుక్‌లో పూలతో అలంకరించిన హెయిర్‌స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జుట్టు పొడవుగా ఉంటే జడ లేదా చిన్న జుడా (కొప్పు) వేసుకోవచ్చు. దానిపై గజ్రా లేదా రంగురంగుల పూలను అందంగా అలంకరించండి. నిజమైన పూలు అందుబాటులో లేకపోతే ఆర్టిఫిషియల్ పూలను ఉపయోగించండి. పూల అలంకరణ కూడా తేలికగా ఉండేలా చూసుకోండి.

తక్కువ నగలతో అందమైన లుక్

Advertisement

నగలు.. రాధ లుక్‌ను మరింత సంప్రదాయంగా కనిపించేలా చేస్తాయి. చిన్న జిమికీలు, గాజులు, హారం లేదా బాజూబంద్‌ (భుజకీర్త లేదా వంకీ) వంటి నగలను ఎంచుకోవచ్చు. వడ్డాణం కూడా సౌకర్యంగా ఉంటే ధరింపజేయండి. అన్ని నగలను ఒకేసారి ఉపయోగించాల్సిన అవసరం లేదు. డ్రెస్‌కు సరిపోయే కొన్ని నగలను మాత్రమే ఎంచుకుంటే లుక్ అందంగా ఉంటుంది.

ఫొటోల కోసం అందమైన ప్రాప్స్ ఉపయోగించండి

చిన్న ప్రాప్స్ ఫొటోలను మరింత అందంగా మార్చగలవు. చిన్నారి చేతిలో పువ్వులు, పూజా తాళం లేదా పూల బుట్ట పెట్టడం, బ్యాక్‌గ్రౌండ్‌లో పూలు, ఊయల లేదా నెమలి ఈకలతో అలంకరణ చేయండి. ఇంట్లోనే సంప్రదాయ వస్త్రాన్ని ఉపయోగించి అందమైన ఫొటో బ్యాక్‌గ్రౌండ్ తయారు చేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ను అందంగా ఉంచండి, కానీ ఎక్కువ వస్తువులతో నింపకండి.

సహజమైన పోజులతో ఫొటోలు తీయండి

చిన్నారిని ఎక్కువసేపు ఒకే పోజ్‌లో ఉండమని బలవంతం చేయకండి.
ఆమె సహజమైన నవ్వు, ఎక్స్‌ప్రెషన్స్‌ను కెమెరాలో క్యాప్చర్ చేయండి.
పూల బుట్ట పట్టుకుని కూర్చోవడం వంటి సింపుల్ పోజ్ ప్రయత్నించండి.
దుపట్టా పట్టుకోవడం లేదా పూజా తాళం పట్టుకోవడం కూడా మంచి పోజ్ అవుతుంది.
సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో తీసిన ఫొటోలు ఎప్పటికీ స్పెషల్‌గా ఉంటాయి.

Also Read: హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

అన్నీ సిద్ధం చేసుకోండి

ముందుగా పూర్తి లుక్‌ను ఒకసారి ప్రయత్నించండి. డ్రెస్, నగలు, హెయిర్‌స్టైల్, ప్రాప్స్ సౌకర్యంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
ఇలా చేయడం వల్ల కృష్ణాష్టమి రోజు చివరి నిమిషంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఫొటోషూట్‌కు ముందు చిన్నారి తినేలా, నీరు తాగేలా చూసుకోండి. ఎక్కువసేపు ఫొటోషూట్ చేస్తే మధ్యలో విశ్రాంతి ఇవ్వండి. భారీ దుస్తులు లేదా అసౌకర్యమైన నగలను ఎక్కువసేపు ధరింపజేయకండి.

అందం కంటే చిన్నారి సౌకర్యమే ముఖ్యం

రాధమ్మ లుక్‌లో సంప్రదాయ అందంతో పాటు చిన్నారి సౌకర్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతోనే అందమైన జన్మాష్టమి లుక్‌ను సులభంగా తయారు చేయండి. సింపుల్ స్టైలింగ్, సహజమైన నవ్వు, అందమైన రంగులు మీ ఫొటోలను ప్రత్యేకంగా మారుస్తాయి.

Also Read: డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×