E-Paper
Advertisement

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!
Advertisement

Sree Mukhi:ఎవరైనా ఇద్దరు సెలబ్రిటీలు జంటగా కలిసి కనిపించినా.. లేదా వెకేషన్ కి వెళ్ళినా.. లేదా ఎక్కడైనా కనిపించినా సరే ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికార్లు చేస్తాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చాయంటూ .. వారి మధ్య లేనిపోని విభేదాలు సృష్టించి, నిజంగానే వారు విడిపోయారు అనే రేంజ్ లో వార్తలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, ఇటు బుల్లితెర షోలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న అరియానా గ్లోరీ (Ariyana Glory) , అవినాష్(Avinash ) మధ్య విభేదాలు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా శ్రీముఖి (Sree Mukhi) ప్రశ్నించడంతో అరియానా తనదైన శైలిలో స్పందించింది.

అవినాష్ తో గొడవలు.. స్పందించిన అరియానా..

విషయంలోకి వెళ్తే.. ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో బిగ్ బాస్ స్కూప్ చేశారు. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఆ ప్రోమో బిగ్ బాస్ స్కూప్ తో ఎన్నో తెలియని ప్రశ్నలతో ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలోనే జడ్జి స్థానంలో ఉన్న శ్రీముఖి అవినాష్ , అరియానాలను ప్రశ్నించింది. బిగ్ బాస్ 4 లో నుంచి అరియానా మిమ్మల్ని అడుగుతున్నాను. అరియానా, అవినాష్ మధ్య గొడవ జరిగింది అది ఎందుకు? అంటూ ప్రశ్నించింది శ్రీముఖి. బయటకు వచ్చిన తర్వాత మాకు చాలా ఇగో క్లాషెష్ వచ్చాయి అంటూ వివరణ ఇచ్చింది అరియానా . ఇద్దరిలో ఎవరి ఈగో వల్ల గొడవ జరిగింది అంటూ అని అడగగా.. అరియాన నా వల్లే అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చింది.

Advertisement

also read:కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

గతంలో ప్రేమ, పెళ్లి అంటూ పుకార్లు..

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో వీరిద్దరూ కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేశారు. నామినేషన్ సమయంలో విపరీతంగా గొడవపడేవారు. టాస్క్ సమయంలో ఒకరిని మరొకరు నిందిస్తూ సీరియస్ అయ్యేవారు.ఆ తర్వాత ఇద్దరి మధ్య చనువు కూడా ఉండేది. అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి. అవినాష్, అరియానా రిలేషన్ చూసి నిజంగా ప్రేమలో ఉన్నారేమో.. హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారేమో అనుకున్నారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కలిసి షోలు చేయడం, గోవా ట్రిప్పులకు వెళ్లడం చూసి పెళ్లి త్వరలో అంటూ పలు రకాల కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో అవినాష్ తన పెళ్లిని ప్రకటించడం , అవినాష్ అవినాష్ కి కంగ్రాట్స్ చెప్పడంతో ఆ రూమర్స్ కాస్త ఆగిపోయాయి. మొత్తానికైతే వీరిద్దరి మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి అంటూ వచ్చిన ఎన్నో వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది.

అరియానా కెరియర్..

Advertisement

ప్రముఖ నటిగా, యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. రాంగోపాల్ వర్మ జిమ్ వీడియోతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు షోలు అంటూ బిజీగా మారిన ఈమె తాజాగా హిజ్రాల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అటు ట్రాన్స్ జెండర్స్ కూడా స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×