E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్
Advertisement

Best single door refrigerator for small familys: ప్రస్తుత కాలంలో మధ్యతరహా లేదా చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఒక పర్ఫెక్ట్ కిచెన్ అప్లయెన్స్‌గా నిలుస్తున్నాయి. తక్కువ కరెంట్ ఖర్చుతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ , బడ్జెట్ ధరలో.. లభించడం వల్ల వీటికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. సెప్టెంబర్ నాటికి అమెజాన్, ఇతర ఆన్‌లైన్ మార్కెట్లలో కస్టమర్ల నుంచి అత్యధిక ఆదరణ పొందుతున్న టాప్-5 సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఏంటి ? వాటి ధరలు, ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్-5 సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు:

మార్కెట్లో ఎంతో నమ్మకమైన బ్రాండ్‌గా పేరుగాంచిన శామ్‌సంగ్ 189 లీటర్ల 5-స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ చిన్న కుటుంబాల బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఇది క్లాస్-లీడింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీని కలిగి ఉండి, ఏడాదికి కేవలం 115 kWh మాత్రమే.. కరెంట్ ఖర్చు చేస్తోంది. దీనిలోని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఎలాంటి సౌండ్ లేకుండా పని చేయడమే కాకుండా.. లాంగ్ లాస్టింగ్ కూలింగ్‌ను అందిస్తుంది. సుమారు రూ. 17,890 నుంచి రూ.18,990 ధరలో లభించే ఈ ఫ్రిజ్‌కు కస్టమర్ల నుంచి ఎక్కువ రేటింగ్ ఉంది.

Advertisement

ఇక స్టైలిష్ లుక్ , సూపర్ కూలింగ్ కోరుకునేవారి కోసం ఎల్జీ 185 లీటర్ల 5-స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ సింగిల్ డోర్ ఫ్రిజిరేటర్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది స్టేబిలైజర్ లేకుండానే వోల్టేజ్ మార్పులను తట్టుకుని పని చేయగలదు. దీనిలోని ‘మోయిస్ట్ ఎన్ ఫ్రెష్’టెక్నాలజీ కూరగాయలను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుతుంది. దీని టఫ్నెండ్ గ్లాస్ షెల్ఫ్‌లు బరువైన పాత్రలను కూడా ఈజీగా మోయగలవు. ఈ మోడల్ మార్కెట్లో సుమారు రూ.17,590 నుంచి రూ.18,490 మధ్య లభిస్తుంది.

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు కోరుకునేవారికి.. హైయర్ 190 లీటర్ల 5-స్టార్ ఇన్వర్టర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ చక్కటి ఆప్షన్. ఇది 120 kWh తక్కువ కరెంట్ ఖర్చుతో అద్భుతమైన కూలింగ్ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. దీనిలోని లార్జ్ వెజిటబుల్ బాక్స్, ఫాస్ట్ ఐస్ మేకింగ్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ ఆహారాన్ని క్రిముల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ఈ హైయర్ మోడల్ సుమారు రూ.15,290 నుంచి రూ. 17,590 ధరలో అందుబాటులో ఉంది.

Advertisement

తక్కువ ధరలో 5-స్టార్ రేటింగ్ కోరుకునేవారికి గోద్రెజ్ 185 లీటర్ల ఇన్వర్టర్ సింగిల్ డోర్ ఫ్రిజ్ బెస్ట్ వాల్యూ అందించే మోడల్. ఇది కేవలం 113 kWh వార్షిక కరెంట్ మాత్రమే ఖర్చు చేయడం దీని ప్రత్యేకత. ఇందులో టర్బో కూలింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఆహార పదార్ధాలు త్వరగా చల్లబడతాయి. కంపెనీ దీనికి అద్భుతమైన వారంటీని.. కూడా అందిస్తోంది. ఈ గోద్రెజ్ మోడల్ మార్కెట్లో సుమారు రూ.16,990 ధరతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Also Read: రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు ! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

చివరిగా, టాటా బ్రాండ్ నమ్మకంతో.. వస్తున్న వోల్టాస్ బెకో 183 లీటర్ల 5-స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ బడ్జెట్ కేటగిరీలో టాప్‌లో నిలిచింది. ఇది మూడు టఫ్నెండ్ గ్లాస్ షెల్ఫ్‌లు, ప్రత్యేకమైన చిల్లర్ జోన్‌ను కలిగి ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు.. కోరుకునే చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఫ్రిజ్ సుమారు రూ. 15,610 ధరలో లభిస్తుంది.

మీ చిన్న కుటుంబం కోసం.. ఒక మంచి సింగిల్ డోర్ ఫ్రిజ్‌ను కొనాలనుకుంటే, తక్కువ కరెంట్ బిల్లు వచ్చే.. 5-స్టార్ ఇన్వర్టర్ మోడల్స్‌ను ఎంచుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు. శామ్‌సంగ్, ఎల్జీ, హైయర్ బ్రాండ్లు బెస్ట్. ఫ్రెష్‌నెస్ , లాంగ్ లాస్టింగ్ వారంటీని అందిస్తున్నాయి. ఆన్‌లైన్ సేల్స్‌లో లభించే డిస్కౌంట్లు , నో-కాస్ట్ EMI ఆప్షన్లను సద్వినియోగం చేసుకొని, మీ ఇంటికి సరిపోయే బెస్ట్ ఫ్రిజ్‌ను ఈరోజే ఇంటికి తెచ్చుకోండి!

Related News

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

Big Stories

Advertisement
×