Anker Prime Gadgets: మనలో చాలామందికి రోజూ వాడే ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వేగంగా, సేఫ్‌గా ఛార్జ్ చేసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. మంచి క్వాలిటీ ఉన్న బ్రాండెడ్ గాడ్జెట్స్ కొనాలని ఉన్నా, వాటి ధరలు చూసి వెనకడుగు వేస్తుంటాం. అయితే, క్వాలిటీకి మారుపేరైన యాంకర్ బ్రాండ్ తమ ప్రీమియం గాడ్జెట్స్‌పై అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ఎక్కువ ధర గల టాప్ లెవెల్ పరికరాలను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఆఫీస్ లేదా వర్క్ డెస్క్ మీద ఉండే రకరకాల వైర్ల గందరగోళానికి చెక్ పెట్టేందుకు ‘యాంకర్ ప్రైమ్ 250W ఛార్జింగ్ స్టేషన్’ అద్భుతమైన ఆప్షన్. ఒకేసారి 6 పరికరాలను వేగంగా ఛార్జ్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. చిన్న ఎల్‌సీడీ డిస్ప్లే ద్వారా పవర్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. సాధారణంగా లభించే ధర కంటే ఏకంగా 37 శాతం డిస్కౌంట్‌తో ఇది అందుబాటులో ఉంది.
Also Read: ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?
యాంకర్ ప్రైమ్ 3-ఇన్-1 వైర్‌లెస్ ఛార్జింగ్ స్టేషన్ సహాయంతో ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌ను ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ అయ్యే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉంచేందుకు ఇందులో ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ఉంది. వైట్, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తున్న ఈ పరికరంపై ప్రస్తుతం 35 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
కంప్యూటర్‌కి ఎక్కువ మానిటర్లు, హార్డ్ డిస్క్‌లు కనెక్ట్ చేసేవారికి ‘యాంకర్ ప్రైమ్ డాకింగ్ స్టేషన్’ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మొత్తం 14 రకాల కనెక్షన్ పోర్టులు ఉన్నాయి. మల్టీటాస్కింగ్ చేసేవారికి ఇది ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రీమియం క్వాలిటీతో వచ్చే ఈ మల్టీపోర్ట్ డాకింగ్ స్టేషన్‌పై సంస్థ 24 శాతం రాయితీ ఇస్తోంది.
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ‘యాంకర్ ప్రైమ్ పవర్ బ్యాంక్’ ఒక గొప్ప ప్రయాణ భాగస్వామిలా పనిచేస్తుంది. అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీతో వచ్చే ఈ పవర్ బ్యాంక్ విమాన ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లను సైతం క్షణాల్లో ఛార్జ్ చేయగల ఈ పవర్ బ్యాంక్‌ను ఇప్పుడు 22 శాతం తగ్గించిన ధరకు కొనుగోలు చేయవచ్చు.
Also Read: లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!