Summer Gadgets 2026: వేసవి ప్రవేశించడంతో ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే పెరుగుతు ఉష్ణోగ్రతలను సమర్థవంతంగా తట్టుకునేందుకు కావాల్సిన అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఈ వేసవిలో హాయిగా జీవించొచ్చు. ఇంతకీ ఆ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏవి? వాటి ఫీచర్లు, ప్రయోజనాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఇవి సాధారణ ఫ్యాన్ల తరహాలో కాకుండా గాలిలోకి సన్నని నీటి తుంపరలను విడుదల చేస్తాయి. తద్వారా భానుడి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిలోని ప్రీమియం మోడల్స్ ను మెుబైల్ యాప్ లేదా రిమోట్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫ్యాన్ నుంచి విడుదలయ్యే నీటి తుంపర్లు 17 మైక్రాన్ల కన్న తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల మీ శరీరానికి తడి అనిపించదు. కానీ ఏసీ లాంటి చల్లదనాన్ని ఫీలవుతారు. ఏసీ కొనేంత బడ్జెట్ లేనివారికి ఇది బెస్ట్ ఛాయిస్. పొర్టబుల్ ఫ్యాన్ అయినందువల్ల దీనిని ప్రయాణాలకు సైతం తీసుకెళ్లవచ్చు.
ఎండకాలంలో ఏసీ, కూలర్లు తరహాలోనే ఇంట్లో ఫ్యాన్ సైతం తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రస్తుతం వస్తున్న అత్యాధునిక ఫ్యాన్లు కేవతం తిరగడమే కాకుండా స్మార్ట్ ఫీచర్లు, విద్యుత్ ఆదా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్లను.. అలెక్సా (Alexa) లేదా గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కంట్రోల్ చేయవచ్చు. యాప్ ద్వారా పవర్ వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే ఇవి 60 శాతం వరకు విద్యుత్తును ఆదా చేస్తాయి. రాత్రిపూట ఆటోమేటిక్ స్లీప్ మోడ్ సెట్ చేసుకోవడం ద్వారా గది ఉష్ణోగ్రతను బట్టి వేగాన్ని సర్దుబాటు చేసుకుంటాయి.
ప్రయాణాల్లో లేదా ఎండలో బయటకు వెళ్లినప్పుడు వ్యక్తిగత చల్లదనం కోసం ఇది ఉత్తమమైన పరికరంగా ఉంటుంది. దీనిని హెడ్ సెట్ లాగా మెడకు ధరించవచ్చు. ఇది బ్లేడ్‌లెస్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి జుట్టు చిక్కుకునే ప్రమాదం ఉండదు. తిరిగి రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు సైతం ఇందులోని మోడల్స్ ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 8-10 గంటల పాటు వినియోగించుకోవచ్చు. వంట గది, ఆఫీసు, ప్రయాణాలు, క్యూలైన్లలో వేచి ఉండేవారికి ఇది ప్రాణవాయువులా పనిచేస్తుంది.
వేసవి కాలంలో దాహార్తి ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్స్, వాటర్, జ్యూస్ లకు ఐస్ ముక్కలు చాలా అవసరం. ఈ నేపథ్యంలో స్మార్ట్ నగ్గెట్ ఐస్ మేకర్ ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం 6 నిమిషాల్లోనే ఐస్ తయారు చేస్తుంది. ఇందులోని ప్రీమియం మోడల్స్ లో యాప్ ద్వారానే ఐస్ తయారీని షెడ్యూల్ చేయవచ్చు. ఇంట్లో చిన్నపార్టీలు జరిగినప్పుడు, సమ్మర్ వెకేషన్స్ కు వెళ్లినప్పుడు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈ స్మార్ట్ బాటిల్స్.. మీ శరీరానికి ఎంత నీరు అవసరమో లెక్కగట్టి క్రమం తప్పకుండా నీరు తాగాలని నోటిఫికేషన్లు ఇస్తాయి. స్మార్ట్ వాచ్ లేదా ఫోన్‌తో సింక్ అయి నిరంతరం ఇవి సందేశాలను పంపిస్తుంటాయి. నీరు తాగడం మర్చిపోయే అలవాటు ఉన్నవారికి, వ్యాయమం చేసే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సమ్మర్ లో చాలా మంది రాత్రిపూట బయట గడిపేందుకు ఇష్టపడతారు. ఆరుబయట, గార్డెన్ లేదా బాల్కనీలో సేదతీరడానికి ఈ స్మార్ట్ లైటింగ్ ఉపయోగపడతాయి. ఇవి పగలు సూర్యరశ్మితో ఛార్జ్ అవుతాయి. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా రంగులను మార్చుకోవచ్చు. ఇవి ఎటువంటి వైరింగ్ అవసరం లేకుండానే ఇంటి బయట అందమైన వెలుతురును అందిస్తాయి. చల్లటి అనుభూతిని పంచుతాయి.
Also Read: Vitamin C serum: స్కిన్ వైటనింగ్ Vs బ్రైటనింగ్.. విటమిన్ సి సీరమ్ మీ చర్మంపై ఎలా పనిచేస్తుంది?