E-Paper
Advertisement

S26 Ultra Privacy Display: గెలాక్సీ S26 అల్ట్రాలో బ్యాంకింగ్, OTPలు సేఫ్.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే?

S26 Ultra Privacy Display: గెలాక్సీ S26 అల్ట్రాలో బ్యాంకింగ్, OTPలు సేఫ్.. కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Galaxy S26 Ultra Privacy Display| స్మార్ట్‌ఫోన్లలో ఇప్పుడు బ్యాంకింగ్ యాప్స్, OTPలు, ప్రైవేట్ చాట్స్ వంటి వ్యక్తిగత సమాచారం చాలా ఉంటుంది. ప్రతి రోజు మీ ఫోన్‌ని ఇతరులు పక్క నుంచి స్క్రీన్‌పై ఉండే గమనించే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి శాంసంగ్ కొత్త ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ తెచ్చింది. గెలాక్సీ S26 అల్ట్రాతో ఈ ఫీచర్ లాంచ్ చేసింది. ఇది ఇండస్ట్రీలో మొదటి హార్డ్‌వేర్ లెవల్ ప్రైవసీ డిస్‌ప్లే అని శాంసంగ్ తెలిపింది. డిస్‌ప్లే ఇంజినీరింగ్‌తో స్మార్ట్ సాఫ్ట్‌వేర్ కలిపి ఈ టెక్నాలజీ తయారు చేశారు.

ప్రైవసీ డిస్‌ప్లే అంటే ఏమిటి?

ప్రైవసీ డిస్‌ప్లే అనేది ఫోన్ స్క్రీన్‌లోనే బిల్ట్-ఇన్ ఫీచర్. డిస్‌ప్లే పిక్సెల్స్ నుంచి లైట్ వెలువడే విధానాన్ని నియంత్రిస్తుంది. స్టిక్-ఆన్ ప్రైవసీ ప్రొటెక్టర్లు లాగా కాదు, స్క్రీన్ ప్యానెల్ లోపలే ఉంటుంది. సాధారణ ప్రొటెక్టర్లు బ్రైట్‌నెస్ తగ్గిస్తాయి, క్లారిటీ పడిపోతుంది. శాంసంగ్ ఈ సమస్యలను తొలగించేలా డిజైన్ చేసింది. ఫీచర్ ఆఫ్ చేస్తే స్క్రీన్ నార్మల్‌గా పనిచేస్తుంది. పూర్తి బ్రైట్‌నెస్, రిచ్ కలర్స్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ లభిస్తాయి. ప్రీమియం AMOLED ప్యానెల్ లాగా అనిపిస్తుంది.

ప్రైవసీ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది?

Advertisement

ప్రైవసీ డిస్‌ప్లే ఆన్ చేస్తే సైడ్ యాంగిల్స్ నుంచి స్క్రీన్ కనిపించదు. పక్కన నిలబడిన వ్యక్తులు కంటెంట్ చూడలేరు. నేరుగా ముందు నుంచి చూసేవారికి మాత్రం స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. యూజర్లు ఈ ఫీచర్‌ను కస్టమైజ్ చేయవచ్చు. సెన్సిటివ్ యాక్టివిటీలకు ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్ అయ్యేలా సెట్ చేయవచ్చు. PIN, పాస్‌వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు, బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. మెసేజింగ్ యాప్స్‌కు కూడా ట్రిగర్ సెట్ చేయవచ్చు. మాన్యువల్‌గా ఆన్-ఆఫ్ చేసుకోవచ్చు. పరిస్థితుల ఆధారంగా సర్దుబాటు చేయవచ్చు.

అడ్జస్టబుల్ ప్రైవసీ లెవల్స్

గెలాక్సీ S26 అల్ట్రాలో మల్టీ ప్రైవసీ మోడ్స్ ఉన్నాయి. పార్షియల్ స్క్రీన్ ప్రైవసీ మోడ్‌లో సెలెక్టెడ్ ఎలిమెంట్స్ మాత్రమే రక్షణ లభిస్తుంది. నోటిఫికేషన్ పాప్-అప్‌లు సైడ్ వ్యూయర్ల నుంచి దాచబడతాయి. లైట్ ప్రైవసీ అవసరాలకు బాగుంటుంది. మాక్సిమమ్ ప్రైవసీ ప్రొటెక్షన్ మోడ్‌లో సైడ్ యాంగిల్ రిస్ట్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి క్రౌడెడ్ ప్లేస్‌లకు సరిపోతుంది. పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ రెండు ఓరియంటేషన్లలోనూ పనిచేస్తుంది. బ్యాటరీపై తక్కువ ప్రభావం ఉంటుంది.

Advertisement

Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?

ఫ్లెక్స్ మ్యాజిక్ పిక్సెల్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

ఈ ఫీచర్ ఫ్లెక్స్ మ్యాజిక్ పిక్సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. పిక్సెల్స్ స్క్రీన్ లైటింగ్ యాంగిల్స్ ద్వారా ఎలా వ్యాప్తి చేస్తాయో నియంత్రిస్తుంది. డిస్‌ప్లే ప్యానెల్‌లో నారో, వైడ్ పిక్సెల్స్ ఉన్నాయి. ప్రైవసీ ఆఫ్‌లో వైడ్ పిక్సెల్స్ డామినేట్ అవుతాయి. లైటింగ్ విస్తృతంగా వ్యాప్తి చేస్తాయి. సైడ్ యాంగిల్స్ నుంచి కూడా ఇమేజ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది.

ప్రైవసీ ఆన్ చేస్తే నారో పిక్సెల్స్ లైటింగ్ కంట్రోల్ చేస్తాయి. సైడ్‌వర్డ్ లైట్ వ్యాప్తి తగ్గుతుంది. ముందు నుంచి స్క్రీన్ బ్రైట్‌గా, క్లియర్‌గా కనిపిస్తుంది. పిక్సెల్ లెవల్‌లో పనిచేస్తుంది. ఎక్స్‌ట్రా లేయర్లు లేకుండా చాలా కచ్చితంగా లైటింగ్ కంట్రోల్ సాధ్యమవుతుంది. బ్రైట్‌నెస్ లాస్, కలర్ డిస్టార్షన్ లేకుండా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది.

ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం?

AI డ్రైవెన్ ఫోన్లలో పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. సెక్యూరిటీ, ప్రైవసీ టాప్ ప్రయారిటీగా మారాయి. శాంసంగ్ ఆన్-డివైస్ డేటా విజిబిలిటీ రక్షణపై దృష్టి పెట్టింది. ప్రైవసీ డిస్‌ప్లే అదనపు సెక్యూరిటీ లేయర్ ఇస్తుంది. షోల్డర్ సర్ఫింగ్ రిస్క్ తగ్గుతుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ప్రభావితం చేయకుండా పనిచేస్తుంది. గెలాక్సీ S26 అల్ట్రా ప్రైవసీ, పర్‌ఫామెన్స్‌ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే డిజైన్లపై ఈ టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×