Smart Rings: ప్రస్తుత టెక్ ప్రపంచంలో స్మార్ట్ రింగ్స్ కు ఆధరణ పెరుగుతోంది. ఇవి చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి మన ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటాయి. వీటి ఫీచర్ల కారణంగా కూడా డిమాండ్ బాగా పెరుగుతోది. 026 నాటికి అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ రింగ్స అంతే కాకుండా వాటి ప్రత్యేకతలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ రింగ్ ఎలా పనిచేస్తుంది ?
స్మార్ట్ రింగ్ అనేద వేలికి పెట్టుకునే చిన్న పరికరం అనే చెప్పాలి. ఇందులో ఉండే సెన్సార్లు మీ గుండె వేగంతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్ధాయి అంతేకాకుండా నిద్ర నాణ్యత , శరీర ఉష్ణోగ్రతలను కూడా ట్రాక్ చేస్తాయి. బరువైన స్మార్ట్ వాచీలను వాడటం ఇష్టం లేని వారికి ఇది అద్భుతమైన ఆప్షన్.
టాప్ స్మార్ట్ రింగ్స్– ఫీచర్లు:
1.శాంసాంగ్ గెలాక్సీ రింగ్స్((Samsung Galaxy Ring)
శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ రింగ్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఇది టైటానియం గ్రేడ్ 5 బాడీతో వస్తుంది కాబట్టి చాలా బలంగా ఉంటుంది. కానీ దీని బరువు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ధర 38 వేలకు పైనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇది మీ ‘ఎనర్జీ స్కోర్’ను చెప్తుంది. అంటే మీరు ఆ రోజు పని చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో కూడా లెక్కిస్తుంది. గెలాక్సీ వాచ్‌తో కలిపి వాడితే బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు దీని బ్యాటరీ చార్జింగ్ వస్తుంది. దీనికి మంచి అందమైన ఛార్జింగ్ కేస్ కూడా ఇస్తారు.
2. అల్ట్రాహ్యూమన్ రింగ్ ఎయిర్ (Ultrahuman Ring Air):
ఇండియన్ కంపెనీ అయిన అల్ట్రాహ్యూమన్ తయారు చేసిన ఈ రింగ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. ఇది అస్సలు వేలికి ఉన్నట్లే అనిపించదు. ధర సుమారు 29 వేల వరకు ఉంటుంది. దీని ప్రత్యేకత ‘మెటబాలిజం ట్రాకింగ్‘. మీరు కాఫీ ఎప్పుడు తాగాలి ? ఎప్పుడు ఎండలో తిరగాలి ? వంటి సూచనలు ఇస్తుంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు కట్టక్కర్లేదు. అంతే కాకుండా 6 రోజుల వరకు ఇది చార్జింగ్ లేకుండా పని చేస్తుంది.
3. బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ (boAt Smart Ring Active):
బడ్జెట్ ధరలో మంచి రింగ్ కావాలనుకునే వారికి బోట్ (boAt) ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఇది చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. అంతే కాకుండా మీకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ధర కూడా సుమారు 4 వేల లోపు ఉంటుంది. ఇదిలా ఉంటే.. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్, స్టెప్స్‌ను కౌంట్ చేస్తుంది. కెమెరా షట్టర్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. 5 నుంచి 7 రోజుల వరకు దీనిబ్యాటరీ చార్జింగ్ ఉంటుంది.
Also Read: స్మార్ట్‌వాచ్.. మీ ఆరోగ్య నేస్తమా? లేక ఏకాగ్రతను చెడగొట్టే శత్రువా ?
4. ఓరా రింగ్ 4:
స్మార్ట్ రింగ్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఓరా (Oura). దీని సెన్సార్లు చాలా ఖచ్చితమైన రీడింగ్స్ ఇస్తాయి. అందుకే దీనిని చాలా మంది వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని ధర సుమారు 30 వేల నుంచి మొదలవుతుంది (కానీ దీనికి ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది). నిద్రను ట్రాక్ చేయడంలో దీనికి సాటి లేదనే చెప్పాలి. మహిళల ఆరోగ్య సమస్యలను, పీరియడ్స్ సైకిల్స్ ని అంచనా వేయడంలో ఇది దిట్ట. సుమారు 8 రోజుల వరకు దీని బ్యాటరీ వస్తుంది.
5. నాయిస్ లూనా రింగ్ (Noise Luna Ring):
నాయిస్ కంపెనీ నుంచి వచ్చిన ఈ రింగ్ లో 70కి పైగా హెల్త్ పారామీటర్లను ట్రాక్ చేసే సదుపాయం ఉంది. సుమారు రూ .15 వేల వరకు దీని ధర ఉంటుంది. ఇది ఫైటర్ జెట్లలో వాడే గ్రేడ్. దీనిలో ఫీచర్లు కూడా చాలా బెటర్‌గా ఉంటాయి.